సమ్మర్ బక్సాఫీసు అంటే ఎలా ఉంటుంది.. వేసవి సెలవలని క్యాష్ చేసుకునేందుకు బడా నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలని విడుదల చెయ్యడమే కాదు.. ఆ సినిమాల ప్రమోషన్స్ కోసం మీడియాలో తెగ హడావిడి చేస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది ఐపీఎల్, అలాగే అదే సమయంలో ఇండియా లో లోక్ సభ, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కారణంగా పెద్ద సినిమాలేవీ విడుదల చేయడం లేదు.
సంక్రాంతి తర్వాత ఇప్పటివరకు భారీ బడ్జెట్ మూవీ ఏది విడుదల కాలేదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు చిన్న చిన్న సినిమాలే బక్సాఫీసు వద్దకు వస్తున్నాయి. రెండు వారాల క్రితం విడుదలైన టిల్లు స్క్వేర్ తప్ప గత వారం విడుదలైన ఫ్యామిలీ స్టార్ ఇవన్నీ నిరాశ పరచడమేగాకదు.. బాక్సాఫీసు నిస్సత్తువుగా మారిపోయింది. కొన్ని వారాలుగా చిన్న చిన్న సినిమాలు వరసగా క్యూ కడుతున్నా అవేమి ప్రేక్షకులని ఇంప్రెస్స్ చెయ్యడం లేదు.
పిల్లలు సెలవల్తో ఖాళీగా ఉన్నారు. సమ్మర్ లో సరదాగా సినిమా చూద్దామంటే ఆయమన్న సినిమా థియేటర్స్ లో లేదు. వేసవిలో బయటికి వెళ్లలేక, హాయిగా థియేటర్ కి వెళదామంటే ఇంట్రెస్టింగ్ సినిమాల్లేక పిల్లలు బోర్ ఫీలవుతున్నారు. అందుకే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు బోర్ కొట్టిస్తున్న బాక్సాఫీసు అంటూ నీరసంగా కామెంట్స్ చేస్తున్నారు.