అసలు కల్కి 2898 AD మేకర్స్ ఏం ఆలోచిస్తున్నారు.. కల్కి చిత్రాన్ని మే 9 నుంచి పోస్ట్ పోన్ చెయ్యడం గ్యారెంటీ. అది ఎప్పటికి మారుస్తారు అనే విషయంలో ఎడతెగని సస్పెన్స్. మే 30 కి కల్కి పోస్ట్ పోన్ చేస్తారని ఒకరు.. లేదు ఏపీలో ఎలక్షన్స్ అయ్యాక జూన్ రెండో వారానికి కల్కి పోస్ట్ పోన్ ఉంటుంది అని మరొకరు, కాదు కాదు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకే కల్కి రిలీజ్ అని మరొకరు అంటున్నారు.
వైసీపీ కి అనుకూల మీడియా అయితే ఏపీలో ఈసారి టీడీపీ వస్తుంది అని కల్కి నిర్మాత అశ్విని దత్ ఆశపడుతున్నారు. టీడీపీ వస్తే కల్కి చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటు ఉంటుంది, అందుకే ఏపీ లో ఎలక్షన్స్ ముగిసి రిజల్ట్ వచ్చేవరకు కల్కి ని రిలీజ్ చెయ్యరు అంటూ కథనాలు స్టార్ట్ చేసింది. ఇదంతా ఓకే అసలు కల్కి ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది ఎవ్వరి ఊహకి అందకుండా మేకర్స్ ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు అంటున్నారు.
ప్రభాస్ ఫాన్స్ అయితే కల్కి రిలీజ్ డేట్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఈచిత్రంలో కమల్ హాసన్ గెస్ట్ రోల్ చెయ్యడం, అమితాబచ్చన్ కీ రోల్ ప్లే చెయ్యడం, దీపికా, దిశా పటాని లు హీరోయిన్స్ గా నటించడమే కాదు.. భైరవగా ప్రభాస్ లుక్ అందరిని తెగ ఇంప్రెస్స్ చెయ్యడంతో ఈ చిత్రంపై అందరిలో బీబత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి.