Advertisementt

నిన్న జగన్ పై.. నేడు పవన్ పై రాయి !

Sun 14th Apr 2024 07:23 PM
pawan kalyan  నిన్న జగన్ పై.. నేడు పవన్ పై రాయి !
A person throws stone at Pawan Kalyan నిన్న జగన్ పై.. నేడు పవన్ పై రాయి !
Advertisement
Ads by CJ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద ప్రమాదమే తప్పింది. ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న పవన్ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఐతే ఆ రాయి ఆయనకు తగలకుండా దూరంగా పడటంతో పెను ప్రమాదం తప్పిందని జనసేన శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో వారాహి యాత్రలో చోటు చేసుకుంది. 

పట్టుకున్నారు!!

కాగా.. వెంటనే అలర్ట్ అయిన పవన్ వ్యక్తిగత సిబ్బంది, జనసేన కార్యకర్తలు రాయి విసిరిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇదంతా వారాహి యాత్రలో జరిగిందని కొందరు చెబుతుండగా.. హెలీఫ్యాడ్ స్థలంలో జరిగిందని మరికొందరు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

నిన్న అలా.. ఇవాళ ఇలా..!!

నిన్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కూడా కొందరు దుండగులు రాళ్లతో దాడి చేయగా.. కన్ను పైభాగంలో తీవ్ర గాయం అయ్యింది. జగన్ రెడ్డితో పాటు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా కన్ను భాగాన గాయం అయ్యింది. ఈ ఘటన మరవక ముందే ఇలా పవన్ పై దాడి జరగడంతో రాజకీయాలు ఇప్పుడు రాళ్ళ చుట్టూ జరుగుతోందని మాటలు వినిపిస్తున్నాయి.

A person throws stone at Pawan Kalyan :

A person throws stone at Pawan Kalyan in Varahi Yatra in Tenali

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ