Advertisementt

మరో బిజినెస్ లోకి రకుల్ ప్రీత్

Sun 14th Apr 2024 01:53 PM
rakul preet  మరో బిజినెస్ లోకి రకుల్ ప్రీత్
Rakul Food Business in Hyderabad! మరో బిజినెస్ లోకి రకుల్ ప్రీత్
Advertisement
Ads by CJ

రకుల్ ప్రీత్ సింగ్ సినిమా కెరీర్ టాప్ రేంజ్ లో ఉండగానే హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు జిమ్ బిజినెస్ మొదలు పెట్టింది. ఫిట్ నెస్ కోసం జిమ్ కి వెళ్లాల్సిందే అంటూ తన బిజినెస్ ని చాలా చోట్ల విస్తరించింది. ఇప్పుడు రకుల్ కెరీర్ లాగే రకుల్ జిమ్ బిజినెస్ కూడా డల్ అయ్యింది. రకుల్ కూడా ఆ బిజినెస్ పై ఫోకస్ పెట్టడం తగ్గించింది. 

ప్రస్తుతం రకుల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. జాకీ భగ్నానీని వివాహం చేసుకుని ముంబై లో సెటిల్ అయిన రకుల్ ప్రీత్ అక్కడ ఒకటి రెండు ప్రాజెక్ట్ లో నటిస్తూ బిజీగానే కనిపిస్తుంది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ జిమ్ బిజినెస్ తో పాటుగా మరో బిజినెస్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఫుడ్ బిజినెస్ ని రకుల్ ఎంచుకుంది. 

మొదటి నుంచి వర్కౌట్స్ తో పాటుగా డైట్ పై ఆసక్తితో వున్న రకుల్ అందరికి హెల్తీ ఫుడ్‌ అందించాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే రకుల్ ఫుడ్ బిజినెస్ కూడా హైదరాబాద్‌ నుంచే స్టార్ట్ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ లోనే రకుల్ రెస్టారెంట్ మొదలు పెట్టేందుకు రెడీ అయ్యింది. ఈ వారంలోనే రకుల్ ప్రీత్ ఫుడ్ రెస్టారెంట్‌ ప్రారంభించబోతుంది. 

Rakul Food Business in Hyderabad!:

Rakul Preet Singh Now Enters In Food Business

Tags:   RAKUL PREET
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ