సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్స్ 2024 లో భాగంగా మెగాస్టార్ చిరు రీసెంట్ గా రాజన్ మసంద్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తిర సమాధానాలిచ్చారు. నాకు క్లాసికల్ సినిమాలు చెయ్యాలని ఉండేది కానీ నా ఫాన్స్ నన్ను మాస్ సినిమాల్లో చూడాలనుకునేవారు. అభిమానుల ప్రేమను కొలవలేను. నాకు మంచి పాత్రాలు ఇచ్చిన దర్శకులకి కృతజ్ఞతలు అని చెప్పిన మెగాస్టార్ ఖైదీ చిత్రం నన్ను అందనంత ఎత్తుకు తీసుకువెళ్ళింది, ఆ చిత్రంలో డాన్స్ లు, యాక్షన్ అన్ని ప్రేక్షకులు ఆదరించారు
బాల చందర్ దర్శకత్వంలో రుద్రవీణ సినిమా చేశా.. మంచి పేరొచ్చింది, నిర్మాతగా నా తమ్ముడికి లాభాలు రాలేదు, ప్రేక్షకులు టు టైప్స్ ఆఫ్ సినిమాలని ఇష్టపడతారు. నేను బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి అన్ని బ్యాలెన్స్ చెయ్యాలి గనకే కమర్షియల్ వైపు అడుగులు వేసాను, చాలామంది ముఖ్యంగా SP బాలు దంగల్ లాంటి చిత్రాలు ఎంచుకోవచ్చు కదా అంటారు. కానీ నిర్మాతలకి అలాంటి సినిమాలు డబ్బులు తెచ్చిపెట్టవు, ప్రొడ్యూసర్ హ్యాపీ గా ఉండలేరు, ఫాన్స్, ప్రేక్షకులు నేను చెసి కమర్షియల్ మూవీస్ చూడడానికే ఇష్టపడతారు.
నాకు ఫ్రీడమ్ ఫైటర్ గా చెయ్యాలని ఉండేది. అందుకే సైరా నరసింహ రెడ్డి చేశా. అది తెలుగులో అంతగా వర్కౌట్ అవ్వలేదు, ఆ సినిమా వల్ల చాలా నష్టపోయాం. నేను తృప్తి పడతా అని నాకు నచ్చిన సినిమా చేస్తే ప్రొడ్యూసర్ నష్టపోతాడు. అందుకే ఈ కమర్షియల్ సినిమాలు అంటూ చిరు అసలు విషయాన్ని తేల్చేసారు.
ఇక RC 16 చిత్రం మొదలైనప్పుడు జాన్వీ కపూర్ తో మాట్లాడుతున్నప్పుడు ఎమోషనల్ అయ్యా, శ్రీదేవి గుర్తొచ్చింది. ఇండస్ట్రీ మంచి నటిని కోల్పోయింది. జగదేక వీరుడు అతిలోక సుందరి రెండో భాగంలో జాన్వీ-చరణ్ నటిస్తే బావుంటుంది అంటూ తన కోరికని బయటపెట్టారు.