మంచు అభిమానులకి మంచు లక్ష్మి గుడ్ న్యూస్ వినిపించింది. గత ఏడాది మార్చ్ లో భూమా మౌనికని ప్రేమ వివాహం చేసుకున్న మనోజ్ ఏడాది గడిచేసరికి వారికీ పాప పుట్టినట్లుగా అక్క మంచు లక్ష్మి అనౌన్స్ చేసింది. గత ఏడాది మౌనిక ప్రెగ్నెంట్ అన్న శుభవార్తని వినిపించిన మనోజ్.. ఈ ఏడాది మౌనిక తో కలిసి బేబీ బంప్ ఫొటోస్ షూట్, అలాగే మౌనిక శ్రీమంతం లో హడావిడి చేసాడు.
ఇక ఏప్రిల్ 13 న మంచు మనోజ్-మౌనికలకి పాప జన్మించినట్లుగా లక్ష్మి ప్రకటించారు. మౌనిక మొదటి కొడుకు ధైరవ్ తనకి చెల్లెలు పుట్టడం పట్ల చాలా హ్యాపీగా ఉన్నట్లుగా చెప్పారు. మంచు మనోజ్ మౌనికని ప్రేమించి తన అక్క లక్ష్మి మంచు ఇంటి దగ్గర అంగరంగ వైభవముగా వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సపరేట్ ఫ్యామిలీ పెట్టి మౌనిక ఆమె కొడుకు ధైరవ్ తో కలిసి ఉంటున్నాడు. మౌనికని వివాహం చేసుకున్న రోజున ధైరవ్ బాధ్యతలు మనోజ్ స్వీకరించాడు.
దేవతల ఆశీర్వచనాలతో బుల్లి దేవత లక్షి దేవి తమ ఇంట్లో అడుగుపెట్టినట్లుగా, ఆ పాపని MM పులి అంటూ మంచు లక్ష్మి మంచు మనోజ్-మౌనికలకి పాప పుట్టిన విషయానన్ని ప్రకటించారు.