Advertisementt

జాన్వీ-కియారా అదృష్టానికి కుళ్ళుకోవాల్సిందే!

Sat 13th Apr 2024 10:41 AM
janhvi kapoor  జాన్వీ-కియారా అదృష్టానికి కుళ్ళుకోవాల్సిందే!
Jhanvi Kapoor -Kiara Advani luck must rot! జాన్వీ-కియారా అదృష్టానికి కుళ్ళుకోవాల్సిందే!
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్స్ గా మారిన ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకోవడం హీరోయిన్స్ కి అదృష్టం కాక ఇంకేమవుతుంది. ఆ అదృష్టాన్ని ఇప్పుడు హీరోయిన్స్ జాన్వీ కపూర్, కియారా అద్వానీలకి తగిలింది. ముందుగా కియారా అద్వానీ రామ్ చరణ్ గేమ్ చెంజర్ లో అవకాశం దక్కించుకుంది, అది పాన్ ఇండియా మూవీ కావడం ఆమెకి బాగా కలిసొస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోతున్న చిత్రం కావడంతో అందరిలో విపరీతమైన అంచనాలు, అంతేకాదు  కియారా అద్వానీపై కూడా స్పెషల్ క్రేజ్ ఉంటుంది.

ఇక ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల శివతో దేవర చిత్రం చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో జాన్వీ కపూర్ హీరోయిన్. ప్రస్తుతం దేవర చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఆ తర్వాత వెంటనే అంటే దేవర విడుదల కాకుండానే జాన్వీ కపూర్ మరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన RC 16 లో అవకాశం పట్టేసింది. మరి జాన్వీ కపూర్ బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమాలు చేస్తుంది. అది నిజంగా ఆమె లక్కే అని చెప్పాలి. 

ఇప్పుడు కియారా అద్వానీ కి కూడా అలాంటి అదృష్టమే పట్టింది. రామ్ చరణ్ తో గేమ్ చెంజర్ లో నటిస్తున్న కియారా అద్వానీ మళ్ళీ మరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. దేవర టైమ్ లోనే కియారా అద్వానీ పేరు ఎన్టీఆర్ పక్కన వినిపించినా అప్పుడు మిస్ అయ్యింది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ హిందీ ప్రాజెక్ట్ వార్ 2 లో కియారా నే హీరోయిన్. 

మరి గ్లోబల్ స్టార్స్ అయిన ఎన్టీఆర్-చరణ్ లతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో హీరోయిన్స్ గా నటిస్తున్న జాన్వీ కపూర్, కియారా అద్వానీలని చూస్తే నిజంగా మిగతా హీరోయిన్స్ కుళ్ళుకోవాల్సిందే. 

Jhanvi Kapoor -Kiara Advani luck must rot!:

Janhvi Kapoor -Kiara Advani

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ