Advertisementt

అందరి చూపు మెగాస్టార్ వైపే!

Fri 12th Apr 2024 01:30 PM
chiranjeevi  అందరి చూపు మెగాస్టార్ వైపే!
Will Chiranjeevi campaign for Janasena party? అందరి చూపు మెగాస్టార్ వైపే!
Advertisement
Ads by CJ

ఇప్పుడందరూ మెగాస్టార్ చిరంజీవి వైపే చూస్తున్నారు. చిరు ఏం చేస్తారా అని. అంటే ఆయన వసిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరిగిపోతుంది. విశ్వంభర షూటింగ్ లో తలమునకలైన మెగాస్టార్ చిరు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీకి 5 కోట్ల ఫండ్ డొనేట్ చెయ్యడమే కాకుండా జనసేన గెలవాలని ఆశీర్వదించి పంపించారు. 

మరి డబ్బు ని డొనేట్ చెయ్యడమేనా? తమ్ముణ్ణి ఆశీర్వదించడమేనా? లేదంటే పిఠాపురంలో తమ్ముణ్ణి గెలిపించే ఆలోచన ఎమన్నా చేస్తున్నారా ఇప్పుడిదే రాజకీయ, సినీ వర్గాల్లో నడుస్తున్న చర్చ. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఏపీకి వెళ్లి జనసేన తరపున ప్రచారం చేస్తారా అనేది అందరి ఆత్రుత. లేదంటే డబ్బు సాయం చేసి చేతులు దులిపేసుకుంటారా అనేది ఇప్పుడు అందరిలో మొదలైన ఆసక్తి. 

మరి చిరు ఏం చేస్తారు, తమ్ముడి కోసం కదులుతారా.. లేదంటే సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిపోతారా.. కాదు అంటే విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్నానని సైలెంట్ అవుతారా అనేది ఇప్పుడు మెగా ఫాన్స్-జనసేన కార్యకర్తలను తొలిచేస్తున్న ప్రశ్న. 

Will Chiranjeevi campaign for Janasena party?:

Will Chiranjeevi Campaign For Congress Party In Andhra Pradesh

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ