యాక్షన్ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరించేస్తారు, కథ లేకపోయినా పర్లేదు, యాక్షన్ ని హాలీవుడ్ రేంజ్ లో చూపిస్తే చాలు అనుకునే రోజులు పోయాయి. అలా రొటీన్ గా వస్తే ప్రేక్షకులు మాత్రం ఊరుకుంటారా.. అందుకే బాలీవుడ్ లో కేవలం యాక్షన్ ప్రధానంగా తెరకెక్కే భారీ బడ్జెట్ సినిమాలని నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి బడేమియా చోటేమియా చేరిపోయింది. బడేమియా చోటేమియా ట్రైలర్ దగ్గర నుంచే సినిమాపై ఉన్న బజ్ ఎగిరిపోయింది.
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు ప్రమోషన్స్ ని ఎంత కొత్తగా ప్లాన్ చేసినా సినిమా విషయానికి వచ్చేసరికి ఆడియన్స్ తిరస్కరించారు. అక్షయ్, టైగర్ ఇద్దరూ కలిసి చాలా డిఫరెంట్ గా ఆడియన్స్ ని పడేసేలా బడేమియా చోటేమియా ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. మరి ఇది చిన్న సినిమా కాదు, మల్టీస్టారర్. మల్టీస్టారర్స్ ని ఆడియన్స్ తిరస్కరించడం చాలా అరుదుగా జరుగుతుంది. బడేమియా చోటేమియా పై విడుదలకు ముందే అంచనాలు తగ్గిపోయాయి. అసలు ఓపెనింగ్స్ లేకుండా పోయాయి. టికెట్ బుకింగ్స్ లేని కారణముగా ఏప్రిల్ 10 కి రావాల్సిన ఈ చిత్రాన్ని 11 కి పోస్ట్ పోన్ చేసారు.
అక్షయ్, టైగర్ ల హీరోయిజం కానీ, పృథ్వీ రాజ్ విలనిజం కానీ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చెయ్యలేదు కంటెంట్ పాత చింతకాయ పచ్చడిలా బోర్ కొట్టెయ్యగా.. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం పూర్ గా ఉండడం, అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టడం, కొన్ని సన్నివేశాలు ఎందుకు పెట్టారో కూడా అర్ధం కాని పరిస్థితిలో ప్రేక్షకులు కొట్టుమిట్టాడడం అన్ని బడేమియా చోటేమియా చిత్రాన్ని ప్రేక్షకులు తిరస్కరించండానికి కారణమయ్యాయి.
బాలీవుడ్ టాప్ క్రిటిక్స్ కూడా బడేమియా చోటేమియా చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది అంటూ ట్వీట్లు చెయ్యడం చూస్తే ఈ చిత్రం ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. మరి ఇది అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లకి బిగ్ షాక్ అనే చెప్పాలి.