పవన్ కళ్యాణ్ కోసం జనసేన పార్టీ తరపున ప్రచారం చేసేందుకు కొంతమంది సెలబ్రిటీస్ షూటింగ్స్ కి సెలవు పెట్టి మరీ ఏపీకి బయలు దేరారు. మొగలి రేకులు సాగర్, హైపర్ ఆది, 30 ఇయర్స్ పృథ్వి, జానీ మాస్టర్ ఇలా కొంతమంది సెలబ్రిటీస్ జనసేన తరపున ప్రచారం చేసేందుకు వెళ్లారు. ప్రస్తుతం పిఠాపురంలో హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తున్నాడు.
అయితే మీడియా వారు హైపర్ ఆది మీరు సినిమాలు, షూటింగ్స్ ఏం చేసి ఈ ప్రచారానికి, రాజకీయాల్లోకి వచ్చారు అని అడగగా.. దానికి హైపర్ ఆది షూటింగ్స్ కొన్ని కంప్లీట్ చేసుకున్నాం, కొన్ని షూటింగ్స్ కి ఓ నెల రోజులు వాయిదా వేసుకున్నాం, ఈ ఎలక్షన్స్ అవ్వగానే మేము వెళ్లి మళ్ళీ షూటింగ్స్ చేసుకుంటామని చెప్పడం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి లక్ష మెజారిటీ వస్తుంది, పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉంటారు, ఆయన గెలిచాక హైదరాబాద్ ని చూడడానికి నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నట్టే.. ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ పిఠాపురాన్ని సందర్శించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు వారు వస్తారు అని చెప్పడంతో.. వైసీపీ నేతలు, కార్యకర్తలు పంచ్ లు వెయ్యడం మొదలు పెట్టారు.
పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఎన్నికల కోసం షూటింగ్స్ ఆపుకుని వచ్చాడు, ఎన్నికలు అవ్వగానే హైపర్ ఆది చెప్పినట్టుగా మళ్ళీ హైదరాబాద్ వెళ్లిపోతారు, ఇలాంటి వారిని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తారా అంటూ కామెడిగా మాట్లాడుతున్నారు.