ప్రస్తుతం అక్కినేని అఖిల్ కొత్త ప్రాజెక్ట్ పై ఆయన అభిమానుల్లోనే కాదు కామన్ ఆడియెన్ లోను విపరీతమైన క్యూరియాసిటీ కనిపిస్తుంది. కానీ అఖిల్ కొత్త చిత్రం విషయం లో ఎందుకో కంగారు పడకుండా కూల్ గా ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు. ఏప్రిల్ 8 న బర్త్ డే కోసం అఖిల్ తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకి వెళ్ళాడు. నిన్న బుధవారమే అక్కినేని నాగార్జున, అమల, చైతు తిరిగి హైదరాబాద్ కి వచ్చేసారు. కానీ అఖిల్ ఈరోజు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు.
ఎయిర్ పోర్ట్ లో అఖిల్ నడిచొస్తుంటే అఖిల్ కొత్త లుక్ లో అంటే హెయిర్ బాగా పొడవుగా పెంచేసి షాకిచ్చాడు. ఎంతగా క్యాప్ పెట్టి కవర్ చేసినా అఖిల్ జుట్టు తో కనిపించి కాస్త సర్ ప్రైజ్ చేసాడు. ఏజెంట్ తర్వాత అఖిల్ హెయిర్ కట్ చేయించుకోలేదా.. లేదంటే కొత్త ప్రాజెక్ట్ కోసం కొత్త మెకోవరా అనేది అభిమానులే కన్యూజ్ అవుతున్నారు.
కొంతమందికి అఖిల్ న్యూ లుక్ నచ్చలేదు, అఖిల్ స్టయిల్ గా హెయిర్ కట్ చేయించుకుని కనిపిస్తే బావుంటుంది అనే అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. ఆయన డ్రెస్ స్టయిల్ బావుంది, ఆయన నడిచే తీరు సూపర్ కానీ హెయిర్ స్టయిల్ చూస్తేనే ఏదోలా ఉంది అనే కామెంట్స్ చేస్తున్నారు. అందులోను అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అతృతతో ఉన్న వారంతా అఖిల్ కొత్త లుక్ చూసి షాకవుతున్నారు.