కాజల్ అగర్వాల్ చందమామగా టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరై ఇప్పుడు సత్యభామగా మారింది. పలు బ్లాక్ బస్టర్ హిట్స్ లో కనిపించిన కాజల్ అగర్వాల్ నటించని టాలీవుడ్ స్టార్ హీరో లేరు. ప్రభాస్ దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరికి మెగాస్టార్ తోనూ నటించింది. తండ్రీకొడుకుల సినిమాల్లో నటించి కాజల్ రేర్ ఫీట్ అందుకుంది.
పెళ్లి ఆ తర్వాత బాబు పుట్టిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ కెరీర్ లో ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంది. కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ తో నటించిన పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2 జూన్ లో విడుదలకు సిద్దమవుతుంది. ఇక పెళ్లి తర్వాత ఎక్కువగా విమెన్ సెంట్రిక్ మూవీస్లో నటిస్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ అనే చిత్రం చేస్తుంది.
ఇక సోషల్ మీడియాలో తరచూ తన ఫొటోస్ తో పాటుగా, ఫ్యామిలీ పిక్స్ ని షేర్ చేసే కాజల్ అగర్వాల్ తాజాగా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న చిత్రాన్ని షేర్ చేసింది. కాజల్ నాజుగ్గా, ఫిట్ నెస్ కోసం వర్కౌట్స్ చేస్తూ జిమ్ డ్రెస్ లో కనిపించింది. ఆ చిత్రం తో పాటుగా B&W అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.