దర్శక ధీరుడు రాజమౌళి పేరు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బాహుబలి సమయంలో మార్మోగిపోగా.. ఆర్.ఆర్.ఆర్ తో హాలీవుడ్ లోను రాజమౌళి మార్క్ క్రేజ్ మొదలైంది. ఆర్.ఆర్.ఆర్ ని ఆస్కార్ బరిలో నిలపడం, కంటెంట్ పరంగా హాలీవుడ్ స్టార్స్ ఆ చిత్రానికి కనెక్ట్ అవడంతో రాజమౌళి పాపులారిటీ బాగా పెరిగిపోయింది. ప్రతి సినిమాకి తన ప్రత్యేకతని చూపిస్తూ స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్న రాజమౌళి గారిలో ఎంతో టాలెంట్ ఉంది. అది కొలమానంలో కొలవడము కష్టమే.
అయితే ఈమధ్య కాలంలో రాజమౌళి గారి నుంచి మరో టాలెంట్ బయటికి వచ్చింది. మొన్నీమధ్యనే రాజమౌళి ఆయన భార్య రమ తో కలిసి ప్రభుదేవా హీరోగా నటించిన ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి చేయి తగిలితే అనే పాట కు డాన్స్ చేశారు. ఒక స్టేజ్ మీద అదిరిపోయే స్టెప్పులతో రాజమౌళి-రమ ఇద్దరూ తమలోని కొత్త టాలెంట్ ని బయటపెట్టి అద్భుతః అనిపించారు. గురువుగారు ఇరగదీశారంటూ నెటిజెన్స్ కూడా కామెంట్స్ కూడా చేసారు. రాజమౌళి పాటకు తగ్గట్లు డాన్స్ చేస్తూ తన భార్య రమ చేతులు పట్టుకుని రొమాంటిక్ స్టెప్స్ వెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్టేజిపై రాజమౌళి దంపతులు డాన్స్ చేస్తుంటే అక్కడున్న వాళ్లంతా ఈలలు, కేకలు వేశారు.
ఆ వీడియో ఇంకా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగానే ఇప్పుడు ఆ పాట ప్రాక్టీస్ వీడియో బయటికి వచ్చింది. రాజమౌళి, రమ ఇద్దరూ ఎంతో డెడికేషన్ తో అందమైన ప్రేమరాణి చేయి తగిలితే పాటని ప్రాక్టీస్ చేస్తున్న వీడియో అది, ఆ వీడియో చూడగానే రాజమౌళి సర్ మీరు మాములు గ్రేట్ కాదు సర్ అంటూ అందరూ మూకుమ్మడిగా కామెంట్స్ చెయ్యడం మొదలు పెట్టారు.