ఇకపై విజయ్ దేవరకొండ తో సినిమా చెయ్యాలి అనుకుంటే దర్శకనిర్మాతల్లో విజయ్ దేవరకొండ పై నెగిటివి పోగొట్టేందుకు ఫైట్ చేసే దమ్ము ఉండాల్సిందే. లేదంటే నెగిటివిటీని దూరం చెయ్యాలంటే కంటెంట్ తో మాట్లాడించాల్సిందే. అలా అయితేనే విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలి అనేలా ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమా లు చూపించాయి.
ఫ్యామిలీ స్టార్ విషయంలో నిర్మాత దిల్ రాజు సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పై చూపించిన నెగిటివిటీపై చాలా ఫైట్ చేసారు. సినిమా బావుంది, కానీ చంపేస్తున్నారు, ఇది ఇండస్ట్రీకి మంచిది కాదు, కావాలని నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ విషయంలో విజయ్ హేటర్స్ తో ఫైట్ చేసారు. అంతేకాదు దిల్ రాజు ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర చేర్చడానికి చాలా కష్టపడ్డారు. సినిమా విడుదలకు ముందు దిల్ రాజు ఈ చిత్రాన్ని తెగ ప్రమోట్ చేసారు.
ఖుషి కన్నా ఫ్యామిలీ స్టార్ కొచ్చేసరికి విజయ్ పై కొంత నెగిటివిటి తగ్గింది అనే చెప్పాలి. ఇకపై ఆయన నుంచి రాబోయే చిత్రాలపై సోషల్ మీడియాలో ఎలాంటి నెగిటివిటీని ఫేస్ చెయ్యాలో అనే ఆందోళన చాలామంది దర్శకుల్లో ఉండే ఉంటుంది. మరి విజయ్ దేవరకొండ తో నెక్స్ట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసే గౌతమ్ తిన్ననూరి విజయ్ కి హిట్ తో పాటుగా అతనిపై వచ్చే నెగిటివిటీని కూడా దూరం చెయ్యాల్సి ఉంటుంది. అటు కంటెంట్ పరంగా, ఇటు నెగిటివిటిని దూరం చేసేలా ప్లాన్ చేసే విషయంలో గౌతమ్ పై దేవరకొండ భారం చాలా ఉంది అనిపించకమానదు అనేలా నెటిజెన్స్ సలహాలు ఉన్నాయి.