విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ట్రోల్స్ కి, నెగెటివ్ రివ్యూస్ కి నాశనమైపోయాడంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారలేదు. కారణం అది అందరికి తెలిసిన విషయమే గనక. ఎప్పుడూ మీడియా ఛానల్స్ లో హాట్ టాపిక్ గా నిలవాలని ఏదో ఒక రకమైన కామెంట్స్ చేస్తూ, ముఖ్యంగా సినీ, రాజకీయ సెలబ్రిటీస్ జాతాలు చెబుతూ, ప్రముఖులతో వెరైటీ పూజలు చేయిస్తూ ఫేమస్ అయిన వేణు స్వామి ఏదో ఒక విషయంలో మీడియాలో కనిపిస్తూనే ఉంటాడు.
అయితే ఈమధ్యన ఫ్యామిలీ స్టార్ తో తీవ్రమైన నెగిటివిటి ఎదుర్కొంటున్న విజయ్ దేవరకొండ జాతకం చూసి విజయ్ ట్రోల్స్ కి, నెగెటివ్ రివ్యూస్ కి నాశనమైపోయాడు, విజయ్ దేవరకొండ సినిమా విడుదలవ్వకముందే కొంతమంది అతనిపై అతని సినిమాలపై నెగెటివ్ ప్రచారం చేస్తూ అతని కెరీర్ నాశనం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.
ఇది వేణు స్వామి చెప్పడం కాదు నిజంగానే విజయ్ దేవరకొండ ప్రస్తుతం రోల్స్ కి, నెగెటివ్ రివ్యూస్ వలన చాలా నష్టపోతున్నాడు. గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్ రిలీజ్ లకి ముందే నెగెటివ్ రివ్యూస్ వచ్చేసాయి, అదంతా విజయ్ దేవరకొండ జాతకంలో ఉన్న దోషమంటూ వేణు స్వామి చెప్పుకొచ్చాడు.