Advertisementt

చైతూని మోసం చేసావ్ అంటే ఊరుకుంటుందా..

Wed 10th Apr 2024 03:29 PM
samantha  చైతూని మోసం చేసావ్ అంటే ఊరుకుంటుందా..
Samantha asked if she cheated on Naga Chaitanya చైతూని మోసం చేసావ్ అంటే ఊరుకుంటుందా..
Advertisement
Ads by CJ

నాగ చైతన్య-సమంత ప్రేమించి పెద్దల అంగీకారంతో ఎంతో గ్రాండ్ గా కుటుంబ సభ్యుల మధ్యన అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఆతర్వాత ఈ జంట ఎక్కడ కనిపించినా దిష్టి తగులుతుంది అనేంత చక్కగా కనిపించేవారు. సమంత-అక్కినేని అభిమానులే కాదు, వీరిరువుర్ని కలిపి ప్రేమించే అభిమానులు ఏర్పడ్డారు. నాలుగేళ్ళ పెళ్లి బంధాన్ని మనస్పర్థల కారణముగా విడాకులతో విడగొట్టుకున్నారు సమంత-నాగ చైతన్య. 

అసలు నాగ చైతన్య-సమంతల విడాకులకు కారణాలు ఎవ్వరికి తెలియదు. కానీ ఈ విషయంలో సమంతని చాలా రకాలుగా టార్చర్ చేసారు అభిమానులు అనే నెటిజెన్స్. సమంత చాలారోజులుగా ఈ భారాన్ని మోస్తూనే ఉంది. ఇప్పటికి చైతూని సమంతనే మోసం చేసింది అంటూ దూషించేవాళ్ళు ఉన్నారు. చైతు-సామ్ విడిపోయి చాలా కాలమే అవుతున్నా ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతోంది. సమంత కి చైతూకి విడివిడిగా తమ విడాకుల గురించి ఎన్నో సందర్భాల్లో రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. 

తాజాగా సమంత ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా ఓ నెటిజెన్ కాస్త ఓవర్ చేసాడు. అమాయకుడైన నాగ చైతన్యను ఎందుకు మోసం చేశావు అంటూ ప్రశ్నించాడు. దానికి సమంత తనదైన స్టయిల్లో స్పందించింది. నన్ను ఈ ప్రశ్న అడగడం మీకు మంచిది కాకపోవచ్చు. దీనిపై మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి. ఏది ఏమైనా మీరు బాగుపడాలి అని కోరుకుంటున్నాను అంటూ తెలివిగా ఇచ్చిపడేసింది. 

Samantha asked if she cheated on Naga Chaitanya:

Samantha sassily gives back to a fan who criticised her for cheating on her ex-husband

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ