అనసూయ భరద్వాజ్ పుష్ప 2 పాన్ ఇండియా ఫిలిం లో నటిస్తుంది. ఈమధ్యనే రజాకార్ చిత్రంతో మంచి హిట్ అందుకున్న అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఫ్యామిలీతో కానివ్వండి, షాప్ ఓపెనింగ్స్ కానివ్వండి, ఏదైనా ఈవెంట్ కి వెళ్లనివ్వండి ముందుగా సోషల్ మీడియాలో ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది.
ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళ్లినా, ఫెస్టివల్స్ సెలెబ్రేట్ చేసుకున్నా ఏదైనా అభిమానులకి చూపిస్తూ వారిని ఆనందపరుస్తుంది. తాజాగా అనసూయ వారణాసి లో ఉన్న పిక్ ని షేర్ చేసింది. Varanasi ❤️🙏🏻 అంటూ ఆ ఫోటో కి క్యాప్షన్ ఇచ్చిది. పడవలో దూరంగా ఉన్న టెంపుల్స్ ని చూస్తున్న బ్యాక్ లుక్ ని వదిలింది అనసూయ. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే నిన్న ఉగాది రోజున అనసూయ ఫ్యామిలీ ఉగాది సెలెబ్రేషన్న్ ఫొటోస్ బయటికి రాకపోవడంతో ఆమె అభిమానులు ఒకింత నిరాశ చెందినా నెక్స్ట్ డే తన వారణాసి పిక్ షేర్ చేసి కూల్ చేసేసింది అనసూయ భరద్వాజ్.