నిన్న మంగళవారం ఉగాది పండుగ సందర్భంగా తారలంతా తమ తమ స్టయిల్లో పూజలు చేసి ఆ ఫొటోస్ ని అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసారు. సినీ సెలబ్రిటీస్ ఎలా పూజ చేసుకున్నారో అనే ఆసక్తి చాలామంది ప్రేక్షకుల్లో ఉంటుంది. అందుకే వారు కూడా సాంప్రదాయంగా ఫెస్టివల్స్ ని నిర్వహిస్తూ కుటుంబ సభ్యులతో ఫొటోలకి ఫోజులిస్తారు.
రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇందు ఉరఫ్ మృణాల్ ఠాకూర్ ఈ ఏడాది గుడి పడ్వా పండుగని ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంది. తన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన మృణాల్ ఆ హ్యాపీ మూమెంట్స్ ని ఫొటోస్ రూపంలో షేర్ చేస్తూ అందరికి Happy Gudi Padwa & Happy Ugadi💖 విషెస్ తెలియజేసింది. గుడి పడ్వా పండుగ నార్త్ ఇండియన్స్ కి చాలా ఇంపార్టెంట్, తెలుగు వారికి ఉగాది పండుగ, నార్త్ ఇండియన్స్ కి గుడి పడ్వా పండుగ స్పెషల్ అన్నమాట.
సో ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ ఎలా ఉన్న మృణాల్ ఠాకూర్ తన కుటుంబంతో గుడి పడ్వా చాలా పద్దతిగా ఘనంగా జరుపుకున్నట్లుగా ఆ ఫొటోస్ చూస్తే అర్ధమవుతుంది.