శ్రీలీల ప్రస్తుతం సైలెంట్ మోడ్ లో కనిపిస్తుంది. వరస వైఫల్యాలు ఆమె కెరీర్ ని ఒక్కసారిగా డల్ చేసేశాయి. క్యూట్ గా, బ్యూటిఫుల్ లుక్ తో కనిపించే శ్రీలీల కెరీర్ పై అవగాహన లేక వచ్చిన ప్రతి అవకాశాన్ని అది తనకి ఎంత హెల్ప్ అవుతుందో అనేది అంచనా వెయ్యకుండా ఒప్పేసుకుంది. ఒకటా రెండా వరసగా ఏడెనిమిది అవకాశాలు రావడంతో ముందు వెనక చూడకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ పోయింది.. ఫలితం ఆమెని ఇప్పట్లో కోలుకోలేకుండా చేసింది.
హీరో కి పేరుందా, పారితోషికం వస్తుందా అనేది చూసుకుంది తప్ప.. తన కేరెక్టర్ ఏమిటో అనేది తెలుసుకోలేకపోయింది. వరసగా మూడు సినిమాల్లో ఒకే రకమయిన కేరెక్టర్ లో నటించింది. మహేష్ బాబు తో ఛాన్స్ ఆమెని మరింత ఊపిరి సలపకుండా చేస్తుంది అనుకుంటే ఆ చిత్రం తర్వాత శ్రీలీల ని ఎవ్వరూ పట్టించుకోవడమే లేదు. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసము, విజయ్ దేవరకొండ తో VD 12 కోసము చూస్తుంది.
కానీ ఇప్పుడు శ్రీలీల కి విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. ముందు హీరోయిన్ గా శ్రీలీల నే అనుకున్నారు. ఆతర్వాత ఆమె తప్పుకుంది రష్మిక వచ్చింది అన్నారు, కానీ ఇప్పుడు శ్రీలీల ప్లేస్ లోకి మరో భామ వచ్చి చేరింది. ప్రేమలు తో ఫేమస్ అయిన మమిత బైజు, లేదంటే భాగ్యశ్రీ బోస్రే పేర్లని పరిశీలిస్తుండగా.. ఫైనల్ గా భాగ్యశ్రీ బోస్రే నే విజయ్ కి జోడిగా VD 12 లో నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇది మాత్రం ఖచ్చితంగా శ్రీలీల కి బిగ్ షాక్ అని చెప్పాలి.