ఉగాది రోజున రాజమౌళి మహేష్ తో తెరకెక్కించబోయే SSMB 29 పై అప్ డేట్ ఇస్తారు, ఈ చిత్రంపై ఓ ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలను అనౌన్స్ చేస్తారు అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అది చూసి మహేష్ అభిమానులు కూడా ఈ ఉగాది కోసం చాలా అంటే చాలా వెయిట్ చేసారు. మహేష్ బాబు-రాజమౌళి కాంబో మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ చివరి దశలో ఉంది అని ఆయనే చెప్పడంతో ఈ ఉగాదికి రాజమౌళి, మహేష్ మూవీ విషయాలను మీడియా కి రివీల్ చేస్తారని అనుకున్నారు.
ఉగాది వచ్చేసింది, అప్పుడే వెళ్ళిపోతుంది కానీ.. SSMB 29 పై ఎలాంటి ఆ డేట్ రాలేదు. దానితో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోతున్నారు. గుంటూరు కారం మిక్స్డ్ రెస్పాన్స్ తో సరిపెట్టుకున్న మహేష్ ఫాన్స్ ఇప్పుడు SSMB 29 అప్ డేట్ కోసం ఆశపడ్డారు. కానీ అది జరగలేదు. ఉగాది సెలెబ్రెషన్స్ తో పాటుగా SSMB 29 అప్ డేట్ తో సెలెబ్రేట్ చేసుకుందామని కలలు కన్న వారి ఆశలపై రాజమౌళి నీళ్లు చల్లారు.
మరోపక్క SSMB 29 పై ఇప్పుడప్పుడే అప్ డేట్ ఉండకపోవచ్చు, మే 31 వరకు అంటే కృష్ణ గారి జయంతి వరకు మహేష్-రాజమౌళి అప్ డేట్ రాకపోవచ్చు, అదే మే 31 నే రాజమౌళి-మహేష్ మూవీ పై అధికారిక అప్ డేట్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు.