Advertisementt

బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న శృతి హాసన్

Tue 09th Apr 2024 04:21 PM
shruti haasan  బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న శృతి హాసన్
Shruti Haasan left Big Project బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న శృతి హాసన్
Advertisement
Ads by CJ

ఈమధ్యన లోకేష్ కనగరాజ్ తో కలిసి ఓ ఆల్బమ్ కోసం రొమాన్స్ విషయంలో ఓ రేంజ్ లో రెచ్చిపోయిన శృతి హాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. కమల్ హాసన్ తనయగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతని చూపించే శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ శాంతను తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ హడావిడి చేస్తుంది. 

అయితే శృతి హాసన్ కి ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ లో బిగ్గెస్ట్ ఛాన్స్ వచ్చింది. బాఫ్టా విజేత ఫిలిప్ జాన్ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న‌ హాలీవుడ్ మూవీ చెన్నై స్టోరీ లో నటిస్తుంది.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవుతుంది అని అన్నారు. ఈఛాన్సు వచ్చినందుకు శృతి హాసన్ చాలా లక్కీ అన్నారు. ఆమె అభిమానులైతే చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నారు. 

త‌న స్వ‌స్థ‌లం చెన్నై క‌థ‌తో హాలీవుడ్ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించే సినిమాలో న‌టించేందుకు శృతి హాసన్ ఇంట్రెస్ట్ చూపించింది. చెన్నై స్టోరీ టైటిల్ కి త‌గ్గ‌ట్టే చెన్నైకి చెందిన యువ‌తీయువ‌కుల క‌థ‌తో రూపొంద‌నుంది, త్వరలోనే చెన్నై స్టోరీ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి అనూహ్యంగా శ్రుతి హాసన్ త‌ప్పుకుంటోంద‌ని తెలిసి ఆమె అభిమానులు ఖంగు తిన్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ నుంచి శృతి హాసన్ ఎందుకు తప్పుకుంటుందో అనేది తెలియాల్సి ఉంది. 

Shruti Haasan left Big Project:

Shruti Haasan left Hollywood Project

Tags:   SHRUTI HAASAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ