అక్కినేని అఖిల్ తన పుట్టిన రోజుని విదేశాల్లో తన ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాడు. నాన్న నాగార్జున, అమ్మ అమల, అన్న నాగ చైతన్య తో కలిసి బర్త్ డే వేడుకల కోసం విదేశాలకి వెళ్లిన అఖిల్.. ఈసారి కూడా అభిమానులని డిస్పాయింట్ చేసాడు. ఏడాదిగా అక్కినేని అభిమానులని కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండా వెయిట్ చేయిస్తున్నాడు అఖిల్.
ఏజెంట్ డిసాస్టర్ ని మరిచిపోలేదా అనే అనుమానం అందరిలో కలిగేలా చేస్తున్నాడు. ఏజెంట్ తర్వాత మీడియా ముందుకు రాని అఖిల్.. కొత్త ప్రాజెక్ట్ విషయంలో మాత్రం ఎటు తేల్చుకోలేకపోతున్నాడు. ఏజెంట్ హిట్ అయినట్లయితే.. ఇమ్మిడియట్ గా ధీర అనే ప్రోజెక్ట్ ని కొత్త దర్శకుడు అనిల్ కుమార్ తో ఎనౌన్స్ చేసేవాడు. కానీ ఏజెంట్ రిజల్ట్ తర్వాత అఖిల్ ఆలోచనలో పడిపోయాడు.
ఎలాంటి కథతో తదుపరి చిత్రాన్ని చెయ్యాలి? ధీర కథ వర్కౌట్ అవుతుందా ? కొత్త దర్శకుడితో ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసి రిస్క్ చెయ్యాలా? లేదంటే మారేదన్నా స్టార్ డైరెక్టర్ తో ముందుకు వెళ్లాలా? అనే ఆలోచనలో అఖిల్ ఉన్నడా అంటే అది క్లారిటీ రావడం లేదు. అసలు అఖిల్ దర్శకుల దగ్గర కథలు విన్నాడనే న్యూస్ కూడా ఈ ఏడాది కాలంలో వినిపించనే లేదు.
నాగ్ కూడా అఖిల్ విషయంలో సీరియస్ గా లేరు. ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇదంతా చూసిన అక్కినేని అభిమానులు బర్త్ డే అవచ్చింది, వెళ్ళింది కానీ కొత్త సినిమా అప్ డేట్ లేదు అని డిస్పాయింట్ అవుతున్నారు.