మెగా ఫ్యామిలీలోకి కొత్త కోడలిగా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి నాగబాబు ఇంట ఏ పండగ జరిగినా చాలా సాంప్రదాయంగా పూజలు నిర్వహిస్తుంది. అత్తగారు పద్మజతో కలిసి పండగలు సెలెబ్రేట్ చేసుకుంటుంది. ఈమధ్యనే వరుణ్ తేజ్ తో కలిసి వెకేషన్స్ కి వెళ్లోచ్చిన లావణ్య త్రిపాఠి.. ఇప్పడు ఉగాది పండుగని తన మరదలు నిహారిక, అత్తగారు పద్మజలతో కలిసి చేసుకుంది.
షడ్ రుచులతో కలిసి ఉగాది పచ్చడి చేసుకుని అత్తగారు, మరదలితో ఫొటోలకి ఫోజులిస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఉగాది ఫెస్టివల్ లుక్ లో లావణ్య త్రిపాఠి చాలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యింది వైట్ చుడిదార్ లో నవ్వుతూ కళగా కనిపించింది. మరి ఎప్పుడు మోడ్రెన్ గానే కాదు అప్పుడప్పుడు ఇలా ట్రెడిషనల్ గా కూడా అంటూ లావణ్య లుక్ కనిపించింది.
సో లావణ్య త్రిపాఠి మొదటి ఉగాది సెలెబ్రేషన్స్ మెగా ఫ్యామిలిలో ఇలా జరిగాయన్నమాట. అయితే ఈ పిక్ లో నాగబాబు, వరుణ్ తేజ్ కనిపించలేదు. నాగబాబు రాజకీయాల పరంగా బిజీ. మరి వరుణ్ ఏ సినిమా షూటింగ్ లో ఉన్నడో అంటూమెగా ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు.