Advertisementt

రేవంత్‌ను ఫాలో అవుతున్న బాబు.. గెలుపేనా!

Tue 09th Apr 2024 10:34 AM
chandrababu  రేవంత్‌ను ఫాలో అవుతున్న బాబు.. గెలుపేనా!
Revanth Reddy advice to Chandrababu... will it work? రేవంత్‌ను ఫాలో అవుతున్న బాబు.. గెలుపేనా!
Advertisement
Ads by CJ

చంద్రబాబుకు రేవంత్ సలహా.. వర్కవుటయ్యేనా!

అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే..! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఫాలో అవుతున్నారు. అర్థమైంది కదా.. తన శిష్యుడు, రాజకీయ ఓనమాలు నేర్చుకున్న రేవంత్‌ను గురువు బాబు ఫాలో అవుతున్నాడన్న మాట. ఇంతకీ ఏ విషయంలో.. ఎందుకు ఫాలో అవ్వాల్సి వచ్చింది..? అనే ఇంట్రస్టింగ్ విషయాలు  www.cinejosh.com ప్రత్యేక పొలిటికల్ కథనంలో చూసేద్దాం రండి.

ఇదీ అసలు కథ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను చిత్ర విచిత్రమైన ప్రకటనలతో ఏడిపించి ఏడు చెరువులు నీళ్లు తాపించారన్నది జగమెరిగిన సత్యమే. ఆఖరికి ఈ ప్రకటనలు ఆపించండి మహాప్రభో అని స్వయంగా బీఆర్ఎస్ అగ్రనేతలే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన పరస్థితి. కేసీఆర్ కారు దిగుతుండగా.. జనాలు తిప్పికొట్టినట్లు ఉండటం, కారు టైర్‌ను పంక్చర్ ఎదురుతిరగడం.. ఏం చేశావని ప్రశ్నిస్తూ వెంబడించడం.. ఇలా ఒకటా రెండా  పదుల సంఖ్యలో ప్రకటనలే. గూగుల్ ఓపెన్ చేసినా.. వెబ్ సైట్లు, యూట్యూబ్.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే దర్శనమిచ్చేవి. దీంతో కేసీఆర్ అంటే ఏంటి.. పదేళ్లలో జనాలకు చేసిందేంటి..? కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు.. కుంభకోణాలు అన్నీ జనాల్లోకి తీసుకెళ్లి.. కేసీఆర్ వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు శూన్యమనే బొమ్మను ప్రకటనల చూపించేశారు. ఇది రేవంత్‌కు పెద్ద ప్లస్సే అయ్యింది. ఈ ప్రకటనలకు గాను కోట్లల్లో కుమ్మరించేసింది అటు కాంగ్రెస్.. ఇటు రేవంత్. దీనంతటికీ ఫలితం కాంగ్రెస్ అఖండ విజయం.. రేవంత్ అనే నేను ప్రమాణ స్వీకారం చేయడం. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు చంద్రబాబు కూడా అచ్చుగుద్దినట్లే ఇదే ఫాలో అయిపోతున్నారు.

బాబేం చేస్తున్నారు..?

వాస్తవానికి 2018, 2019 ఎన్నికల టైమ్‌లో ఇప్పుడున్నంతగా సోషల్ మీడియా లేదు. ఉన్నా అంతంత మాత్రమే. ఇప్పుడు ప్రచారం అంటేనే సోషల్ మీడియా అన్నట్లుగా పరిస్థితులు వచ్చేశాయి. ఎవరు చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్.. దీంతో పార్టీలన్నీ బాగా క్యాష్ చేసేసుకుంటున్నాయ్. సరిగ్గా వాడుకుంటే సక్సెస్.. లేకుంటే అట్టర్ ప్లాప్ అంతే. ఇప్పుడిదే సోషల్ మీడియాను చంద్రబాబు తెగ వాడేస్తున్నారు. ఏపీలో పెన్షన్ల  పంపిణీకి సంబంధించి నాలుగైదు రకాలు ప్రకటనలు ఇచ్చి.. జగన్‌ను గట్టిగానే బద్నాం చేస్తోంది టీడీపీ. పెన్షన్ ఆపిందెవరు..? ఎందుకివ్వలేకపోయింది వైసీపీ..? పెన్షన్ల దొంగ ఎవరు..? ఇలా అన్ని ప్రశ్నలేస్తూ ఆఖరికి పెన్షన్ల కోసం పోరాటం చేసి ఇప్పించింది.. తానే అని జనాల్లోకి గట్టిగానే తీసుకెళ్తున్నారు బాబు. ఇది టీడీపీకి బాగానే ప్లస్ అయ్యింది.. అంతకుమించి మైనస్ కూడా అయ్యిందనే మిశ్రమ స్పందన వస్తోంది. మరి అధికార పార్టీ అయ్యుండి.. వైసీపీ ఎందుకు వదులుతుంది.. ఇంతకుమించే ప్లాన్ చేసే ఉంటుంది కదా.. సమయం, సందర్భం కోసం వేచి చూస్తోందేమో.!

సలహా ఇచ్చిందెవరో..?

ఇదివరకు రాజకీయ పార్టీల ప్రకటనలు అంటే.. ఇదిగో మేం అది చేస్తాం.. ఇది చేస్తాం.. అసలు మా పార్టీకి ఎందుకు ఓటేయాలి..? గెలిస్తే ఏం చేశామనేది ఉండేది. ఇప్పుడు అంతా సోషల్ మీడియా కాలం కదా.. అవతలి పార్టీలపై విషం చిమ్మడమే టార్గెట్. తాము ఏం చేస్తామన్నది పక్కనెట్టేసి.. వాళ్లేం చేయలేదు.. వాళ్ల పార్టీ వేస్ట్ అని చెప్పుకోవడానికే సరిపోతోంది. రేవంత్‌కు ఇలాంటి ప్రకటనలు బాగానే వర్కవుట్ అయ్యాయి. ఆయనే ఇలా చేయండని ఓ ముఖ్యమైన వ్యక్తి ద్వారా చంద్రబాబుకు చెప్పించారనే టాక్ కూడా నడుస్తోంది. గతం సరే.. ఇప్పుడు చంద్రబాబుకు ఏ మాత్రం సెట్ అవుతాయి.. గెలుపుకు దగ్గరగా తీసుకెళ్తాయా..? లేదా రివర్స్ అవుతాయా అనేది మే-13, జూన్-04న చూడాల్సిందే మరి.

Revanth Reddy advice to Chandrababu... will it work?:

ChandraBabu who is following Revanth.. is he going to win!

Tags:   CHANDRABABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ