యానిమల్ తో పాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ తన తదుపరి చిత్రాన్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చెయనున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 AD పాన్ వరల్డ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ లో ఉన్నారు. మరోపక్క మారుతి కూడా రాజా సాబ్ షూటింగ్ ని చక్కబెడుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ కూడా కంప్లీట్ చెయ్యబోతున్నారు.
మరోపక్క సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ స్పిరిట్ చిత్ర ప్రి ప్రొడెక్షన్ పనుల్లో బిజీగా వున్నారు. అప్పడప్పుడు ఆయన స్పిరిట్ అప్ డేట్స్ ఇస్తూ అందరిలో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా స్పిరిట్ గురించి ఆసక్తికర విషయాలను సందీప్ వంగ రీసెంట్ ఇంటర్వ్యూలో బయట పెట్టి ప్రభాస్ అభిమానులని సర్ ప్రైజ్ చేసారు. ఆయన స్పిరిట్ స్టోరీ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అలాంటి ఆఫీసర్ జాబ్ లో, తనకి దగ్గర వ్యక్తి విషయంలో ఒక తప్పు జరుగుతుంది. ఆ తరువాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది స్పిరిట్ కథ అంటూ చెప్పి నిజంగానే సర్ ప్రైజ్ చేసారు.
ఇప్పటికే స్పిరిట్ స్క్రిప్ట్ 60 శాతం పూర్తి అయ్యిందని.. డిసెంబర్ నాటికి స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి.. ఆ తర్వాత సెట్స్ మీదకి తీసుకు వెళ్తామని చెప్పిన సందీప్ రెడ్డి ఈ మూవీపై 300 కోట్ల బడ్జెట్ ని పెడుతున్నట్లు వెల్లడించారు. ఇక స్పిరిట్ కి సంబందించిన ట్రైలర్ మరియు టీజర్ అనుకున్నట్లు ఆడియన్స్ కి రీచ్ అయితే.. ప్రభాస్ ఇమేజ్ కి ఓపెనింగ్స్ కిందే 150 కోట్లు వచ్చేస్తాయని సందీప్ వంగ ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ రేంజ్ ని తెలియజేయడమే కాదు అందుకు తగిన ధీమాని వ్యక్తం చేశారు.