ఉగాదికి ఒక రోజు ముందే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ద రూల్ నుంచి వచ్చిన టీజర్ పాన్ ఇండియా మార్కెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. గంటలో 500 లైక్స్ తో పుష్ప టీజర్ దూసుకుపోతుంది. సోషల్ మీడియా మొత్తం అల్లు అర్జున్ గంగమ్మ జాతర మ్యానియాలో తడిచిముద్దవుతుంది. ఇది చూసి తట్టుకోలేని యాంటీ ఫాన్స్ రేపు తమ అభిమాన హీరోల నుంచి రాబోయే అప్ డేట్స్ కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు. రేపు మంగళవారం స్పెషల్ అంటే ఉగాది పండుగ. సో కొత్త సినిమాల అప్ డేట్స్ తో టాలీవుడ్ సోషల్ మీడియా మోత మోగిపోవడం ఖాయం.
అందులో ముఖ్యంగా ప్రభాస్ కల్కి 2898 AD మేకర్స్ కల్కి పోస్ట్ పోన్ విషయాన్ని కన్ ఫర్మ్ చేస్తూ కొత్త డేట్ ఇస్తారని ప్రభాస్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరోపక్క బాలయ్య అభిమానులు బాబీ దర్శకత్వంలో రాబోయే NBK 109 టైటిల్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర నుంచి ఏదో ఒక పోస్టర్ వస్తే బావుంటుంది అని ఎన్టీఆర్ ఫాన్స్ ఆశపడుతున్నారు. ఇక మెగా అభిమానులైతే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేస్తారేమో అనే ఆతృతలో కనిపిస్తున్నారు.
మరోపక్క పాన్ ఇండియా బిగ్గెస్ట్ అప్ డేట్ అంటే రాజమౌళి-మహేష్ మూవీ SSMB 29 నుంచి ఉగాది కి క్రేజీ అప్ డేట్ వస్తుంది అనే ఆశలో మహేష్ అభిమానులు ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ OG నుంచి లుక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాటితో పాటుగా వెంకీ-అనిల్ రావిపూడి సినిమాపై ప్రకటన, నాగార్జున కొత్త సినిమా కబురు, నాగ చైతన్య తండేల్ న్యూస్ ఇలా ప్రతి హీరో అభిమాని తమ హీరోల కొత్త సినిమాల నుంచి అప్ డేట్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
మరి రేపు ఉగాది రోజున పెద్ద, చిన్న, మీడియం సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియా ఉగాది పచ్చడి మాదిరిగా తయారవడం ఖాయం. ఉగాది పచ్చడి అంటే లవ్, మాస్, యాక్షన్, రొమాంటిక్, ఎమోషనల్ ఫిలిం పోస్టర్, టీజర్స్ తో వచ్చే అప్ డేట్స్ అన్నమాట.