శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్. ఈ చిత్రం గత నెల థియేటర్స్ లో విడుదలైంది. మంచి టాక్ తో స్టార్ట్ అయిన ఓం భీమ్ బుష్ మూవీ అద్భుత్తమని అనలేం కానీ థియేటర్స్ లో మంచి కల్లెక్షన్స్ నమోదు చేసింది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ల కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసారు.
పరీక్షల సమయంలో విడుదలైన ఈ మూవీని థియేటర్స్ లో మిస్ అయ్యి ఎప్పుడెప్పుడు ఓటీటీలో వీక్షిద్దామా అని ఫ్యామిలీ ఆడియన్స్, స్టూడెంట్స్ చాలా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓం భీమ్ బుష్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసారు. ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
అమేజాన్ ప్రైమ్ నుంచి ఏప్రిల్ 12న స్ట్రీమింగ్ కి రానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అంటే మరో ఐదు రోజుల్లో అమెజాన్ నుంచి ఓం భీమ్ బుష్ ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది.