మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప విడుదలకు ముందే అద్భుతాలు సృష్టిస్తుంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అన్ని భాషల లెజెండ్స్ నటించడంతో పాన్ ఇండియా లో ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని ఎక్కువగా న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లోనే తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు బయటికొచ్చిన అప్ డేట్స్ మొత్తం క్రేజీ అప్ డేట్స్ కావడం గమనార్హం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో మహాశివుని పాత్రలో కనిపించనుండడం, మలయాళ నటుడు మోహన్ లాల్ భాగమవడం, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ని కన్నప్ప ప్రాజెక్ట్ లోకి ఆహ్వానించడం దగ్గర నుంచి ఏ అప్ డేట్ వదిలినా అది క్షణాల్లో వైరల్ అవుతూ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియాలో భీభత్సమైన అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు కన్నప్పలోకి ఎంటర్ కాబోతున్నారంటూ స్కిల్ మీడియాలో అప్ డేట్స్ మీద అప్ డేట్స్ కనిపిస్తున్నాయి.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కన్నప్పలో ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. కీ రోల్ చేయనున్న శివ రాజ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి అక్షయ కుమార్ వచ్చాడంటున్నారు. మరికొద్ది రోజుల్లో అక్షయ్ కుమార్ ఈ సినిమా షూటింగ్‌లో కూడా జాయిన్ కానున్నాడు. పైగా కన్నప్పలో అక్షయ్ కుమార్ పాత్ర కథలో చాలా కీలకం అంటున్నారు.
ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇప్పుడు మంచు విష్ణు పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది అని తెలుస్తుంది. ఇక తమిళంలో నుంచి లేడీ సూపర్ స్టార్ నయనతార పార్వతి పాత్రలో కనిపించబోతుంది అంటున్నారు. ఇలా ప్రతిసారి అభిమానులు సర్ప్రైజ్ చేసే న్యూస్ లే కన్నప్పపై వినిపిస్తున్నాయి.