పుష్ప ద రూల్ ఫస్ట్ లుక్ లోనే అల్లు అర్జున్ అందరిని చాలా ఇంప్రెస్స్ చేసాడు. అమ్మవారి మాదిరి చీర కట్టి తాండవం చేసాడు. అప్పటినుంచి పుష్ప ద రూల్ లో గంగమ్మ జాతర ఎపిసోడ్ పై వచ్చిన న్యూస్ పుష్ప కి సంబంధించి ఏ ఎపిసోడ్ పై రాలేదు. అంతలా పుష్ప గంగమ్మ జాతర సోషల్ మీడియాలో హైలెట్ అయ్యిది. నిజంగానే అల్లు అర్జున్ గంగమ్మ తల్లి లుక్ అభిమానులకి పూనకాలు తెపించింది.
ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా వచ్చిన పుష్ప ద రూల్ టీజర్ పై గత నాలుగైదు రోజులుగా మేకర్స్ అందిస్తున్న ప్రీ టీజర్ అప్ డేట్స్ టీజర్ పై మరింత అంచనాలు పెంచేసాయి. మరి ఈరోజు బన్నీ బర్త్ డే స్పెషల్ గా వచ్చిన పుష్ప ద రూల్ టీజర్ లో అల్లు అర్జున్ గంగమ్మ జాతరలో పవర్ ఫుల్ గా మాస్ గా ఎంట్రీ ఇచ్చిన విధానానికి అభిమానులే కాదు మాస్ ఆడియన్స్ కూడా విజిల్స్ వెయ్యాల్సిందే.
గంగమ్మ జాతర సెట్ అయితే అద్భుతం అనేలా ఉంది. అల్లు అర్జున్ గంగమ్మ గెటప్ లో చేసిన యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయింది. చీర కట్టి, కాలు వెనక్కి మడిచి చుట్టూ తిప్పిన సీన్ కి థియేటర్స్ లో కేకలు, అరుపులే.
టీజర్ విజువల్స్ ఒక ఎత్తు, అల్లు అర్జున్ లుక్ & పెర్ఫార్మన్స్ మరో ఎత్తు, టీజర్ మొత్తంలో పుష్పరాజ్ తప్ప మరొకరు ప్రేక్షకుల కళ్లకు కనిపించరు. నీ యవ్వ తగ్గేదేలే అని మరోసారి తన రాజసాన్ని చూపించాడు అల్లు అర్జున్. లుక్ పరంగానే కాదు, ఆ యాటిట్యూడ్, ఆ స్టయిల్ అన్ని అల్లు అర్జున్ ఫాన్స్ కి భీభత్సమైన కిక్ ఇచ్చాయి. సుకుమార్ మేకింగ్ యాజ్యుజ్వల్ గా అద్దిరిపోయింది, దేవిశ్రీ BGM అయితే ఒణుకు పుట్టించేదిలా ఉంది. అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2 టీజర్ లో వేరే లెవల్ చూపించాడనడంలో సందేహం లేదు.