కేరళలో సినిమా రిలీజ్ అయ్యాక మూడు రోజుల పాటు రివ్యూస్ ఇవ్వకూడదని ఒక కోర్టు చెప్పడం జరిగిందట. అలాంటిదేదో ఇక్కడ(టాలీవుడ్) కూడా వస్తే కానీ ఇండస్ట్రీ బాగుపడదు. ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అనేది ఎవరూ చూడడం లేదు. ఏదో నెగెటివ్ వైబ్స్ పెట్టుకుని చెయ్యడం వల్ల ఎఫెక్ట్ అయ్యేది ప్రొడ్యూసర్స్. ఎంతో కష్టపడి చేసిన సినిమాని ఆడనివ్వకుండా, ప్రేక్షకులని థియేటర్స్ కి రానివ్వకుండా చెయ్యడం అనేది ఇండస్ట్రీపై ఇంపాక్ట్ పడుతుంది.
దీని ద్వారా పోను పోను చాలా డ్యామేజ్ జరిగి ఇంక సినిమాలు ఏం చేస్తాంలే అనే అభిప్రాయంలోకి చాలామంది వెళతారు. దాని వల్ల చాలా చేంజెస్ వస్తాయి.. నెగిటివిటీ కరెక్ట్ కాదు, బాలేదు అనేది మీ ఒపీనియన్, కానీ అది ప్రేక్షకుల మీద రుద్దడం కరెక్ట్ కాదు అంటూ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ పై సోషల్ మీడియాలో కనిపించిన విపరీతమైన నెగిటివిటీ ఇప్పటివరకు దిల్ రాజు నిర్మించిన ఏ సినిమాపై కనిపించలేదు. అది విజయ్ ఎఫెక్ట్ లేదా దిల్ రాజు ఎఫెక్ట్ అనేది తెలియదు కానీ.. ఒక చెత్త సినిమాపై నెగిటివిటీ చూపించడం వేరు, కాస్త బావున్న సినిమాపై బాడ్ కామెంట్స్ చెయ్యడం వేరు. మరి దిల్ రాజు ఇలా మొత్తుకోవడంలో తప్పులేదు.