ఎవడ్రా.. ఎవడ్రా వీడు.. అంటే
తొలి సినిమాతో విమర్శలను ఎదుర్కొన్నొడే.. టాలీవుడ్ తలరాతను మార్చేశాడే
ఎవడ్రా.. ఎవడ్రా వీడు అంటే..
అల్లు పేరుతో ఉన్న.. చిరుకి మరో నట వారసుడు
వహ్.. వాట్ ఏ జర్నీ.. హీరోగా పరిచయమైంది గంగోత్రి సినిమాతో. ఎన్నో విమర్శలు, ఎన్నో అవమానాలు, గోల్డెన్ స్పూన్ అంటూ రాతలు, అదేం ముఖం అంటూ తోటి ఆర్టిస్ట్‌ల నుండే హేళనలు.. తిప్పి కొడితే 20 సంవత్సరాల తర్వాత టాలీవుడ్‌కి గర్వంగా నిలిచిన స్టార్, ఒక కెరటంలా ఉవ్వెత్తున లేచి.. తనని విమర్శించిన వారి నోటి నుండే ప్రశంసలు కురిపించుకునే స్థాయికి చేరి.. ఇప్పుడొక ఐకాన్‌లా మారిన స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే. ఏ హీరోకి అయినా.. తన కెరీర్‌లో ఎత్తు పల్లాలు ఉంటాయి. అల్లు అర్జున్ కూడా వాటిని ఫేస్ చేశాడు. వాటి నుండి ఎంతో నేర్చుకున్నాడు. ఫెయిల్యూర్స్‌ని సక్సెస్‌కి మెట్లుగా మలుచుకుని.. తన దారిని తనే వేసుకుంటూ.. ఒక్కో మెట్టు ఎక్కి.. ఈ రోజు టాలీవుడ్ శిఖరాగ్రానికి చేరుకున్నా.. అప్పుడే అయిపోలేదు.. ఇప్పుడే మొదలైంది.. ఇప్పుడే మొదలైంది.. ఇక తగ్గేదేలే అంటూ దూసుకెళుతున్న ఈ ఐకాన్ పుట్టినరోజు నేడు (ఏప్రిల్ 8).
అల్లు అర్జున్.. అదొక బ్రాండ్
అల్లు అర్జున్ అంటే ఇప్పుడు పేరు కాదు.. అదొక బ్రాండ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరు, బాలయ్య, నాగ్, వెంకీ శకం ఇంకా నడుస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారంతా హెవీ కాంపిటేషన్ ఇస్తూనే ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో తన దారి కొత్తగా ఉండాలి, తనెంటో అందరికీ తెలియాలి. నా కాలు మీద నేనే కాలు వేసుకుని కూర్చోవాలి.. అని ఆలోచించిన అల్లు అర్జున్.. తన పంథాని మార్చాడు. మెగా ట్యాగ్ నుండి సాధ్యమైనంతగా బయటికి రావాలని ప్రయత్నం చేశాడు. అల్లు ఆర్మీతో సరికొత్త బ్రాండ్‌గా మారాడు. నిజంగా.. అల్లు అర్జున్ ఉన్న పరిస్థితులలో ఇలాంటి నిర్ణయం చాలా సాహసోపేతమైనది. సాహసం చేయనిదే.. సక్సెస్ దక్కదు అని భావించిన బన్నీ.. ఏదైతే అది అయిందని.. అల్లు బ్రాండ్‌ని పెంచే పనిలో నిమగ్నమయ్యాడు. దీనికి కొందరు వేరుకుంపటి అని పేర్లు పెట్టారు.. అయినా లెక్క చేయలేదు. ఎన్నో విమర్శలు.. ఏం పట్టించుకోలేదు. అయినవారు కూడా అనుమానించారు.. అవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అని భావించాడు తప్ప.. తను ఎన్నుకున్న మార్గంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. నిజంగా ఇవన్నీ తనకు బాధను కలిగించేవే.. అయినా లెక్క చేయకుండా.. తను అనుకున్న, రాసుకున్న, గీసుకున్న రేఖను ఫాలో అయ్యాడు కాబట్టే.. ఈ ఐకాన్ స్టార్ పేరు ఈ రోజు ఎంతో ప్రత్యేకంగా వినబడుతోంది. ఆ ప్రత్యేకత ఏంటో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా..
వెనుక మాస్టర్ మైండ్
వీడు వెర్రిబాగులోడు.. వీడికేం తెలియదు.. ఓ రూ. 10 లక్షల రూపాయలు వాడి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయిస్తా.. ఎలాగోలా బతికేస్తాడు.. ఇవి ఎవరి మాటలో తెలుసుగా. తన మనవడు అల్లు అర్జున్‌ని ఉద్దేశిస్తూ.. ఒకప్పుడు ది లెజెండ్ అల్లు రామలింగయ్య అన్న మాటలిలి. అలాంటి వెర్రిబాగులోడు.. ఈ రోజు ఇండస్ట్రీని శాసిస్తున్నాడంటే.. దాని వెనుక మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ కృషి ఎంతో ఉంది. తన కొడుకును నమ్మాడు.. నేను ఇలా వెళదామని అనుకుంటున్నా.. అంటే ఓకే ప్రొసీడ్ అన్నాడు. అంతే, అల్లు ఆర్మీ సిద్ధమైంది. అక్కడ నుండి అల్లు అర్జున్ వేసిన ప్రతి అడుగు వెనుక ఈ మాస్టర్ మైండ్ ఎంతో పని చేసింది. అది బయటకు తెలియకపోయినా.. ఒక కొడుకు కోసం తండ్రి ఏం చేయగలడో.. అంతకంటే ఎక్కువే చేశాడు అల్లు అరవింద్. అయితే తండ్రి నమ్మకాన్ని కూడా ఈ కొడుకు నిలబెట్టాడనుకోండి. అదెలా అంటే.. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఏ హీరోకి రాని నేషనల్ అవార్డును సాధించి.. తండ్రిని గర్వపడేలా చేశాడీ పుష్పరాజ్.
దర్శకులు, దర్శకుల్ని నమ్మే హీరో..
అల్లు అర్జున్ సామాన్యంగా సినిమా అంగీకరించడు.. ఇది అందరికీ తెలిసిందే. హిట్టు, సక్సెస్ అనేవి సెకండరీ. ముందు తను ఆ పాత్రకు న్యాయం చేయగలను అనుకుంటేనే.. ఆ పాత్రకు తను పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతే ఓకే చెప్తాడు. ఒక్కసారి దర్శకుడిని నమ్మాడంటే.. ఆ దర్శకులు కూడా బన్నీకి ఫ్యాన్ అయిపోతారు. త్రివిక్రమ్, సుకుమార్ వంటి వారు రిపీటెడ్‌గా బన్నీతో సినిమాలు చేయడానికి కారణమిదే. బన్నీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ సినిమా జులాయి. ఆ సినిమాతో బన్నీ ఇమేజ్, క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తన స్థాయి ఇదని చాటి చెప్పిన చిత్రమది. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్.. కెరీర్ ఎలా పీక్‌కి చేరిందనే దానికి.. ఇది చదివే చాలా మంది సాక్షులే.
ఆ నమ్మకమే నిజమైంది
సినిమా ఇండస్ట్రీ అంటే.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా వేరు వేరు కాదని, అంతా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అని నమ్మే వ్యక్తులలో అల్లు అర్జున్ మొదటి వ్యక్తిగా ఉంటాడు. ఇదే విషయం ఆయన పలు సందర్భాలలో చెప్పాడు కూడా. దీనికి కారణం కూడా లేకపోలేదు. అల్లు అర్జున్ అంటే కేవలం టాలీవుడ్ స్టార్‌గా ఎవరూ చూడరు. కేరళలో బన్నీకి మల్లు అర్జున్ అని పేరుంది. అక్కడ ఈ హీరో సినిమాలకు, ఈ హీరోకు ఉన్న క్రేజ్ మాములుది కాదు. అలాగే పుష్ప సినిమాతో నార్త్ బెల్ట్‌లోనే కాదు.. ప్రపంచ సినీ ప్రేక్షకులని అలరించి.. అందరి అభిమానం పొందాడు. అందరూ తనని ఆరాధించేలా చేసుకున్నాడు. గంగోత్రి సినిమాతో విమర్శలని ఎదుర్కొన్న వాడు.. ఈ రోజు మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మ పెట్టే స్థాయికి చేరాడంటే.. ఇంతకంటే ఏం కొలవగలం, ఏం చెప్పగలం.. ఈ ఐకాన్ స్టార్ సక్సెస్ గురించి. ఇలాంటి మరెన్నో గుర్తింపులు, మరెన్నో విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం తప్ప.
డియర్ బన్నీ.. ఇప్పుడున్న గుర్తింపుతో సరిపెట్టుకోకుండా.. ఇప్పుడున్న గుర్తింపుని గర్వంగా ఎక్కించుకోకుండా.. నీ యాటిట్యూడ్‌తో.. నీయవ్వ తగ్గేదేలే అని దూసుకుంటూ వెళ్లాలని కోరుకుంటూ.. సినీజోష్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది. హ్యాపీ బర్త్‌డే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.