నిన్న శనివారం కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ గారు కమల్ హాసన్ తో తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 ని జూన్ లో విడుదల చేస్తున్నామంటూ ప్రకటించారు. పర్టిక్యులర్ డేట్ మెన్షన్ చెయ్యకపోయినా.. ఇండియన్ 2 జూన్ లో వస్తుంది అని చెప్పారు. ప్రస్తుతం ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా గేమ్ చెంజర్ షూటింగ్ కూడా శంకర్ చుట్టేస్తున్నారు. ఫైనల్లీ ఫైనల్లీ ఇండియన్ 2 విడుదల గురించి చెప్పి దాని కథ ఆల్మోస్ట్ ముగించారు.
ఇక మిగిలింది గేమ్ చెంజర్ పనే. అంటే గేమ్ చెంజర్ షూటింగ్ త్వరగా ముగించేసి.. ఆ రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తే మెగా ఫాన్స్ రిలాక్స్ అవుతారు. గేమ్ ఛేంజర్ లో కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటికి విజువల్ వర్క్ కి సంబంధించి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. శంకర్ సిజి వర్క్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. అందుకే ముందుగా షూటింగ్ ముగించి ఇండియన్ 2 ని విడుదల చేసి కూల్ గా గేమ్ చెంజర్ విడుదల పై ఆయన దృష్టి పెడతారని తెలుస్తుంది.
దిల్ రాజు గారు చెప్పినట్టుగా మరో ఐదు నేలలంటే ఆగష్టు కానీ, సెప్టెంబర్ లో కానీ గేమ్ చెంజర్ విడుదల ఉండొచ్చు, కాదు అనుకుంటే అక్టోబర్లో గేమ్ చెంజర్ దసరాకి విడుదల చెయ్యొచ్చు. మే చివరికల్లా గేమ్ చెంజర్ షూటింగ్ పూర్తవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇండియన్ 2 పబ్లిసిటీ, విడుదలలో శంకర్ బిజీ అవుతారు. జూన్ నుంచి కంప్లీట్ గా శంకర్ గేమ్ చేంజర్ పైనే ఉంటారని అంటున్నారు. అప్పటి నుంచి గ్యాప్ లేకుండా గేమ్ చెంజర్ పనులని ఆయన చక్కబెట్టేస్తారట.