బాలీవుడ్ లో సీరియల్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ ని నార్త్ ఇండస్ట్రీ అంతగా పట్టించుకోలేదు. గ్లామర్ చూపించినా మృణాల్ ని లైట్ తీసుకుంది. అదృష్టం కొద్దీ హను రాఘవపూడి ఈ మోడ్రెన్ గర్ల్ మృణాల్ ని తీసుకొచ్చి సీతారామంలో సీత పాత్ర ఇచ్చి సౌత్ ప్రేక్షకుల మనసులో గుడి కట్టుకునేలా చెయ్యడంలో 100 పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. ఆ చిత్రాన్ని సౌత్ నుంచి నార్త్ ఆడియన్స్ వరకు ఇష్టపడ్డారు. ముఖ్యంగా సీతగా మృణాల్ లుక్స్, ఆమె కేరెక్టర్ ని ఆరాధించారు.
ఆ తర్వాత హీరో నాని తో హాయ్ నాన్న అంటూ అదే బ్యూటిఫుల్ లుక్స్ తో అమాయకంగా కనిపించింది. ఒక పాపకి తల్లిగా, నానికి భార్య గా, గర్ల్ ఫ్రెండ్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో మెరిసింది. ఆ చిత్రం కూడా సక్సెస్ అయ్యింది. దానితో సౌత్ లో హ్యాట్రిక్ కొడదామనుకుని కలలు కన్న మృణాల్ కి ఫ్యామిలీ స్టార్ బ్రేకులు వేసింది. విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబోలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్.
ఈ చిత్రం లో మృణాల్ ఇందు పాత్రలో కనిపించింది. ఇంతకుముందు.. సీత కేరెక్టర్, హాయ్ నాన్నలో కేరెక్టర్స్ యష్ణ, వర్ష మిక్సీలో వేసి రుబ్బితే ఎలా ఉందొ ఇందు కేరెక్టర్ అలా ఉంది అనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. హ్యాట్రిక్ హిట్ కొడదామనుకున్న మృణాల్ కి సౌత్ లో ఫ్యామిలీ స్టార్ తో బిగ్ షాక్ తగిలింది అని చెప్పుకుంటున్నారు. విజయ్ దేవరకొండతో మృణాల్ కెమిస్ట్రీ ఓకె ఓకె అంటూ పెదవి విరుస్తున్నారు.
సీతారామం, హాయ్ నాన్న రెండు సినిమాలు మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఫ్యామిలీ స్టార్ మాత్రం అలా జరగలేదు. మరి ఈ టాక్ మృణాల్ ని ఇబ్బంది పెట్టేదిలానే ఉంది. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో ప్రోపర్ గా పాల్గొంది, టీం తో కలిసి కష్టపడింది. కానీ ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ మాత్రం మృణాల్ ని కష్టపెట్టేదిలానే ఉంది.