Advertisementt

ఫైనల్లీ ప్రేమలు తెలుగు ఓటీటీ డేట్ వచ్చేసింది

Sun 07th Apr 2024 11:00 AM
premalu  ఫైనల్లీ ప్రేమలు తెలుగు ఓటీటీ డేట్ వచ్చేసింది
Premalu is coming to aha ఫైనల్లీ ప్రేమలు తెలుగు ఓటీటీ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రేమలు ని తెలుగులో SS కార్తికేయ డబ్ చేసి మార్చ్ లో విడుదల చేసారు. మళయాళం లోనే కాదు విడుదలైన అన్ని భాషల్లోనూ ముఖ్యంగా తెలుగులోనూ ప్రేమలు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ అంతా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూసారు. 

అయితే ప్రేమలు ఓటీటీ రైట్స్ దక్కించుకున్న డిస్ని ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు మళయాళ వెర్షన్ డేట్ ని రివీల్ చేసారు. కానీ ప్రేమలు చిత్ర తెలుగు ఓటీటీ రైట్స్ ని ఏ ఓటీటీ దక్కించుకుంది, ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తుంది అనే విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ప్రేమలు తెలుగు వెర్షన్ ని ఆహా వారు ఫ్యాన్సీ డీల్ కి ఓటీటీ రైట్స్ కొనెయ్యడమే కాకుండా.. ఎప్పుడు స్ట్రీమింగ్ లోకి తేబోతున్నారో అధికారికంగా ప్రకటించేసారు.  

ఆహా ఓటీటీ నుంచి ఈ సినిమా ఈ ఏప్రిల్ 12 న స్ట్రీమింగ్ కాబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దానితో యూత్ మొత్తం ఏప్రిల్ 12 న ప్రేమలు ని ఓటీటీలో వీక్షించేందుకు రెడీ అవుతున్నారు. 

Premalu is coming to aha:

Finally Premalu Telugu OTT date has arrived

Tags:   PREMALU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ