Advertisementt

ఫైనల్లీ ఇండియన్ 2 రిలీజ్ పై స్పష్టత

Sat 06th Apr 2024 06:45 PM
bharateeyudu2  ఫైనల్లీ ఇండియన్ 2 రిలీజ్ పై స్పష్టత
Bharateeyudu2 (Indian 2) box office attack in June ఫైనల్లీ ఇండియన్ 2 రిలీజ్ పై స్పష్టత
Advertisement
Ads by CJ

భారతీయుడు చిత్రంతో బాక్సాఫీసుని షేక్ చేసిన లోకనాయకుడు కమల్ హాసన్-కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ లు దానికి సీక్వెల్ గా ఇండియన్ 2 ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు, ఎప్పుడో కరోనా సమయంలోనే షూటిగ్ పూర్తి కావాల్సిన ఇండియన్ 2 కొన్ని కారణాల వలన అలస్యమవుతూ వచ్చింది. ఈలోపు దర్శకుడు శంకర్ చరణ్ తో పాన్ ఇండియా ఫిలిం ని మొదలు పెట్టేసారు. ఆ తర్వాత అటు ఇండియన్ 2 ఇటు ఆ గేమ్ చేంజర్ సినిమాల షూటింగ్స్ తో శంకర్ సతమతమయ్యారు. కానీ ఫైనల్ అవుట్ ఫుట్ అందరూ మెచ్చేలా ఉండాలని, రిలీజ్ ఆలస్యమవుతున్నా కాన్ఫిడెంట్ గా వర్క్ చేసుకుంటూ వచ్చారు. 

భార‌తీయుడు సీక్వెల్ అంటే ఎలాంటి అంచ‌నాలుంటాయో వాటిని మించేలా డైరెక్ట‌ర్ శంక‌ర్ భార‌తీయుడు 2ను విజువ‌ల్ వండ‌ర్‌గా ఆవిష్క‌రిస్తున్నారు. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాడే స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ ప‌వ‌ర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వ‌టానికి రెడీ అయ్యారు. 

ఎప్పటి నుంచో ఇండియన్ 2 రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్న కమల్ అభిమానులు, భారతీయుడు అభిమానులకి ఈరోజు శనివారం ఫైనల్ గా ఆ తేదీని మేకర్స్ రివీల్ చేసారు. ఇండియన్ 2 విడుదల తేదీ కోసం కళ్ళు కాయలు కాచేలా చూసిన ప్రేక్షకులకి ఇండియన్2 మేకర్స్ తెర తీశారు. జూన్ లో ఇండియన్ 2 బాక్సాఫీసు వద్దకు రానున్నట్లుగా క్యాలెండర్ లో మార్క్ చేసుకోమని పోస్టర్ తో సహా ప్రకించారు. 

పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. తెల్ల‌టి ధోతి, కుర్తాలో క‌మ‌ల్ హాస‌న్ క‌నిపిస్తున్నారు. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం అంటే ఎంత స్వ‌చ్చంగా ఉండాలో అంత‌టి స్వ‌చ్చ‌త పోస్ట‌ర్‌లో ప్ర‌స్పుటంగా క‌నిపిస్తోంది. జీరో టాల‌రెన్స్ (త‌ప్పును అస్స‌లు భ‌రించ‌లేను) అని పోస్ట‌ర్‌పై ఉన్న లైన్ చాలా ప్ర‌భావ‌వంతంగా ఉంది. ఇక క‌మ‌ల్ హాస‌న్ కూడా సీరియ‌స్‌, ఇన్‌టెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. అలాగే మ‌నదేశాన్ని అవినీతి క్యాన్స‌ర్‌లా ప‌ట్టి పీడిస్తోంది. ఈ విష‌యాన్ని అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా ఈ పోస్ట‌ర్‌లో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ధూమ‌పానానికి వ్య‌తిరేకంగా చేసిన ప్ర‌క‌ట‌న‌ల నుంచి ప్రేర‌ణ‌తో ఈ పోస్ట‌ర్‌ను త‌యారు చేశారు. ఇది సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచుతోంది.

అయితే జూన్ లో ఇండియన్ 2 రిలీజ్ అన్నారు కానీ పర్టిక్యులర్ తేదీని మాత్రం ఇవ్వకుండా సస్పెన్స్ లో పెట్టారు. అయితే ఇండియన్ 2 జూన్ 15 న విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తేదీని కూడా ఉగాది రోజున ఇండియన్ 2 మేకర్స్ స్పెషల్ పోస్టర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

Bharateeyudu2 (Indian 2) box office attack in June:

Ulaganayagan Kamal Haasan Bharateeyudu2 (Indian 2) box office attack in June

Tags:   BHARATEEYUDU2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ