Advertisementt

విజయ్ దేవరకొండ కెరీర్ లో చెత్త ఓపెనింగ్స్

Sat 06th Apr 2024 05:35 PM
vijay deverakonda  విజయ్ దేవరకొండ కెరీర్ లో చెత్త ఓపెనింగ్స్
Vijay Deverakonda Recent Movies 1st Day Collections విజయ్ దేవరకొండ కెరీర్ లో చెత్త ఓపెనింగ్స్
Advertisement
Ads by CJ

గతంలో విజయ్ దేవరకొండ సినిమాలు వస్తున్నాయి అంటే యూత్ ఆసక్తిగా ఎదురు చూసేవారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం టైం లో విజయ్ దేవరకొండ సినిమాలంటే యూత్ లో పిచ్చ క్రేజ్ ఉండేది. ఆ తరవాత రౌడీ స్టార్ ట్యాగ్ తో విజయ్ పాపులారిటీ బాగా పెరిగింది. లైగర్ సినిమా సమయంలో విజయ్ దేవరకొండ పై నార్త్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కలగడమే కాదు.. అక్కడి సెలబ్రిటీస్ విజయ్ దేవరకొండ పై చేసిన కామెంట్స్ కూడా అతనికి బాగా హెల్ప్ అయ్యాయి. బాలీవుడ్ పార్టీస్ లో పాల్గొనడం, హిందీ హీరోయిన్స్ తో పార్టీల్లో పాల్గొన్న పిక్స్ బయటికొచ్చి బాగా హైలైట్ అయ్యేవి. 

అయితే లైగర్ ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ పై బాగా పడింది. ఆ తర్వాత వచ్చిన ఖుషి సినిమా హిట్ అన్నా కలెక్షన్స్ రాలేదు. ఆ రిజల్ట్ విజయ్ ని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కోసం ఎంతో కష్టపడ్డాడు. కానీ విజయ్ కి అనుకున్న సక్సెస్ దక్కలేదు. అసలు విజయ్ సినిమాకి ఓపెనింగ్స్ దక్కలేదు అంటేనే అతని మార్కెట్ లో ఎంత వేరియేషన్ వచ్చిందో అర్ధమవుతుంది. 

విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్లో ఏపీ-టీఎస్ లో మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే.. అన్నిటికన్నా తక్కువ ఫ్యామిలీ స్టార్ కి రావడం ఆశ్చర్యకర విషయం. అంటే విజయ్ క్రేజ్ పడిపోయిందా.. అందుకే ఓపెనింగ్స్ తగ్గాయా, లేదంటే ఫ్యామిలీ స్టార్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు కలగలేదా.. ఏది ఏమైనా విజయ్ కేరీర్ లోనే చెత్త  ఓపెనింగ్స్ ఫ్యామిలీ స్టార్ కి నమోదు అవ్వడం రౌడీ ఫాన్స్ కి బిగ్ షాక్ అనే చెప్పాలి. 

#VijayDeverakonda Recent Movies 1st Day Collections(AP-TG)

👉#TheFamilyStar- 3.85CR******

👉#KUSHI- 9.87CR

👉#LIGER - 9.57CR

👉#WorldFamousLover - 4.40Cr

👉#DearComrade - 7.50Cr

👉#Taxiwaala - 3.30Cr

👉#NOTA - 4.55Cr

👉#GeethaGovindam- 5.81Cr

Vijay Deverakonda Recent Movies 1st Day Collections:

Vijay Deverakonda Recent Movies 1st Day AP-TS Collections

Tags:   VIJAY DEVERAKONDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ