ఈరోజు శనివారం తెలుగులో డబ్బింగ్ మూవీగా విడుదలైన మలయాళం సూపర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ సినిమాని వీక్షించిన తెలుగు ప్రేక్షకులు తెగ పొగుడుతున్నారు. క్రిటిక్స్ కూడా సూపర్ హిట్ రేటింగ్స్ ఇచ్చారు. మలయాళంలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి 200 కోట్లు కొల్లగొట్టిన ఈమూవీని తెలుగులో చూసిన ఓ తెలుగు ప్రేక్షకుడు ఇలా ఫీలవుతూ సోషల్ మీడియాలో స్పందించాడు.
సినిమా గ్రాండియర్ గా తీయడం..
గ్రాఫిక్స్ మాయాజాలం..
Larger then life storys..
ఇది కాదు ఇండియన్ సినిమా అంటే..
ఇండియన్ సినిమా అంటే ఎమోషన్..
ఇండియన్ సినిమా అంటే ట్రెడిషన్..
ఇండియన్ సినిమా అంటే శాక్రిఫైజేషన్..
ఆనందాలు.. ఆహ్లాదాలు.. ఆశలు.. ఆకాంక్షలు.. అవమానాలు.. నిరాశలు.. నిస్పృహలు.. సరదాలు.. సంతోషాలు.. సంబరాలు.. స్నేహాలు.. ప్రేమలు.. బాధలు.. భయాలు.. బంధాలు.. అపార్ధాలు.. అభద్రతాభావాలు.. వీటన్నిటి సమ్మేళనమే భారతీయ సినిమా.. అదో భావోద్వేగాల కలబోత..
ఇన్నాళ్ళూ నివురుగప్పి వున్న ఈ నిజాన్నీ.. ఓ చిన్న సినిమా రాజేసీ.. భగ్గు మనిపించింది..
రెండున్నర గంటలపాటు భౌతికమైన శరీరాలు మాత్రమే థియేటర్లో వున్నాయ్..
ఆత్మలు మాత్రం తెరలోకి దూరి.. లొకేషన్ లోకి దూకి.. పాత్రధారులతో కలిసి.. జరుగుతున్న కథలో తాము కూడా భాగమై.. పోరాటాలు చేశాయ్..
ఇదీ.. నిజమైన అద్భుతం..🙏🏼😊
భారతీయ సినిమా రొమ్ము విరుచుకొని నిఠారుగా నిల్చుంది..
ఇప్పుడు మన సినిమా హాలీవుడ్ సినిమాకు తీసిపోదు..
డైరెక్టర్ చిదంబరం సార్.. 🙏🏼😊
మా కళ్ళు తరించిపోయాయ్.. ఆ కలవరం నుంచి బయటికి రాలేకపోతున్నాం..
నా 47ఏళ్ల జీవితంలో మంజుమ్మల్ బాయ్స్ లాంటి సినిమా నేను చూడలేదు..🙏🏼
ఇది కేవలం నా అభిప్రాయం.. 🙏🏼😊
మీ అభిప్రాయం వేరైతే.. అది మీ వాల్ మీద రాసుకోండి.. నా జోలికి రావద్దు..
- నరసింహ బుర్ర అనే వ్యక్తి పోస్ట్ ఆన్ ఫేస్ బుక్