Advertisementt

ఈ వారం డబ్బింగ్ మూవీ దే హవా

Sat 06th Apr 2024 01:47 PM
manjummel boys  ఈ వారం డబ్బింగ్ మూవీ దే హవా
Manjummel Boys premiere talk ఈ వారం డబ్బింగ్ మూవీ దే హవా
Advertisement
Ads by CJ

ఈ శుక్రవారం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో పాటుగా ప్రముఖ డిజైనర్ ధని ఏలే కొడుకు నటించిన భరత నాట్యం సినిమాలు విడుదలయ్యాయి. భరత నాట్యానికి డిసాస్టర్ టాక్ రాగా.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ రోజు శనివారం మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై 200 కోట్లు కొల్లగొట్టిన మంజుమ్మెల్ బాయ్స్ డబ్బింగ్ మూవీ గా తెలుగులో విడుదలైంది. 

మైత్రి మూవీ మేకర్స్ లాంటి బిగ్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ చిత్రం తెలుగులోనూ భారీగా ప్రమోషన్స్ చేసింది. మలయాళంలో సూపర్ హిట్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన మంజుమ్మెల్ బాయ్స్ ఇక్కడ తెలుగు ప్రీమియర్స్ తోనే అదిరిపోయే రెస్పాన్స్ రాబట్టింది. విడుదలకు ఒకరోజు ముందే మంజుమ్మెల్ బాయ్స్ ప్రీమియర్స్ వేయగా.. అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అలాగే క్రిటిక్స్ కూడా ఈ చిత్రానికి మూడు రేటింగ్స్ ఇవ్వడం కూడా మంజుమ్మెల్ బాయ్స్ ఖచ్చితంగా తెలుగులోనూ బిగ్ హిట్ అనే సంకేతాలు పంపుతుంది. 

ఈ వారం స్ట్రయిట్ తెలుగు చిత్రాలు ఆశించినంతగా లేకపోవడం, సమ్మర్ హాలిడేస్ కావడం అన్ని మంజుమ్మెల్ బాయ్స్ కి కలిసొచ్చే అంశాలే. మలయాళంలో క్రియేట్ చేసిన మ్యాజిక్కే మంజుమ్మెల్ బాయ్స్ తెలుగులో కూడా రిపీట్ చేస్తుంది అనేలా ఉంది సోషల్ మీడియా రెస్పాన్స్. మరి ఈ వారం మలయాళ డబ్బింగ్ సినిమా మంజుమ్మెల్ బాయ్స్ దే హవా అనడంలో ఎలాటి సందేహం లేదు. 

Manjummel Boys premiere talk:

Manjummel Boys telugu response

Tags:   MANJUMMEL BOYS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ