ప్రభాస్ అభిమానులు ఏ క్షణాన కల్కి పోస్ట్ పోన్ అనే వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళనలో ఉన్నారు. జనవరి 12 నుంచి మే 9 కి మారిన కల్కి 2898 AD రిలీజ్ తేదీ ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి ఎక్కడికి వెళుతుందో అని వారి బాధ. మే 9 న సినిమాని విడుదల చేస్తే దేశ వ్యాప్తంగా జరగబోయే ఎన్నికల ఎఫెక్ట్ కల్కి మీద ఖచ్చితంగా పడుతుంది. అందుకే మేకర్స్ కల్కిని పోస్ట్ పోన్ చెయ్యాల్సి వచ్చేలా ఉంది. అయితే కల్కి పోస్ట్ పోన్ విషయం పై మేకర్స్ మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా కనబడుతున్నారు.
అయితే కల్కి మేకర్స్ కల్కిని పోస్ట్ పోన్ చేస్తున్నామని ప్రకటిస్తే సరిపోదు, కొత్త తేదీని కూడా ఇచ్చేసి అభిమానులకి కిక్ ఇవ్వాలని వారు కూడా తర్జన భర్జన పడబట్టే ఈ లేట్ కి కారణమని తెలుస్తోంది. జూన్ కానీ, జులై కానీ కల్కి ని విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనేది వారి ఆలోచనట. కానీ తాజా సమాచారం ప్రకారం కల్కి 2098 AD ని మే 9 నుంచి మే 30 కి మారిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట.
మరి అదే నిజమైతే ప్రభాస్ ఫాన్స్ రెండు వారాలు వెయిట్ చేస్తే కల్కి వచ్చేస్తుంది. సో మే 9 నుంచి పోస్ట్ పోన్ అయితే పెద్దగా కంగారు పడక్కర్లేదు, రెండు వారాలు ఆగితే వారి ఆనందానికి అవధులు ఉండవు. మరి మే 30 కి కల్కి ని పోస్ట్ పోన్ చేస్తే ఆ డేట్ ఏదో త్వరగా అనౌన్స్ చేసే ప్రభాస్ అభిమానులు కాస్త రిలాక్స్ అవుతారు.