మెగా ఫ్యామిలీలోకి చిన్న కోడలిగా అడుగుపెట్టిన అమ్మాయి లావణ్య త్రిపాఠి ఓ హీరోయిన్. అంటే గ్లామర్ విషయంలోనూ, ఫిట్ నెస్ విషయంలోనూ ఆమె స్టయిల్ వేరుగా ఉంటుంది. మెగా ఫ్యామిలీ పెద్ద కోడలు ఉపాసన కూడా పర్సనల్ జిమ్ ట్రైనర్ తో ఆమె బరువు బాగా తగ్గి ప్రెజెంట్ నాజుగ్గా తయారైంది. ఇక చిన్న కోడలు స్వతహాగా హీరోయిన్ కావడంతో ఆమె ఫిట్ నెస్ కోసం ప్రాణం పెడుతుంది. వరుణ్ తేజ్ ని పెళ్లాడిన తర్వాత సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి యాక్టీవ్ గా ఫొటోస్ షేర్ చేస్తుంది.
అయితే రీతు వర్మ, నిహారిక లతో కలిసి జిమ్ చేసే లావణ్య త్రిపాఠి తాజాగా ఓ వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో లావణ్య త్రిపాఠి బ్యాక్ కనిపించేలా జిమ్ చేస్తుంది. అంతేకాని ఫ్రెంట్ వీడియో మాత్రం వదల్లేదు. నాలుగు రోజుల నుంచే జిమ్ కి వస్తున్నా.. అది కూడా కొన్ని నెలల తర్వాత అంటూ లావణ్య త్రిపాఠి క్యాప్షన్ పెట్టింది.
ఆమె జిమ్ లో కష్టపడి వర్కౌట్స్ చేస్తున్న వీడియో ని షేర్ చెయ్యగానే మెగా చిన్న కోడలు లావణ్య జిమ్ విన్యాసాలు చూసారా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక కెరీర్ లో లావణ్య త్రిపాఠి కాస్త డల్ స్టేజ్ లో ఉండగా.. వరుణ్ తేజ్ కూడా మట్కా షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు.