Advertisementt

బర్త్ డే ని కూడా వదలవా రష్మికా..!

Fri 05th Apr 2024 10:05 PM
rashmika mandanna  బర్త్ డే ని కూడా వదలవా రష్మికా..!
Rashmika Latest Workout Video Goes Viral బర్త్ డే ని కూడా వదలవా రష్మికా..!
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న బర్త్ డే ఏప్రిల్ 5th. ఈరోజు రష్మిక ఎక్కడ, ఎలా తన బర్త్ డే ని ఎలా సెలెబ్రేట్ చేసుకుందో అనే ఆత్రుతలో అభిమానులు ఉన్నారు. అటు రష్మిక మందన్న నటిస్తున్న చిత్రాల నుంచి అదిరిపోయే అప్ డేట్స్ వదిలారు మేకర్స్. పుష్ప ద రూల్ నుంచి రష్మిక శ్రీవల్లి కొత్త లుక్ వదిలారు. అందులో ఒంటినిండా బంగారంతో గ్రీన్ చీరలో ఆదరగొట్టేసింది. అలాగే కుబేర నుంచి త్వరలోనే రష్మిక ఫస్ట్ లుక్ వదులుతాము, ప్రస్తుతం ఆమెకి బర్త్ డే విషేష్ అంటూ చెప్పారు.

ఇక గర్ల్ ఫ్రెండ్ నుంచి రష్మిక లుక్ ని ఆ మేకర్స్ విడుదల చేసారు. రష్మిక బర్త్ డే ని తన స్నేహితుడు విజయ్ దేవరకొండ దుబాయ్ లో సెలెబ్రేట్ చేసాడు, దాని కోసమే ఇద్దరూ వేర్వేరుగా ఎవ్వరికి దొరక్కుండా అబుదాబి వెళ్లారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. అయితే రష్మిక తన బర్త్ డే ని ఎలా ఎక్కడ సెలెబ్రేట్ చేసుకుందో అని ఎదురు చూసే వారికి ఒక వీడియో వదిలింది.

బర్త్ డే రోజు కూడా రష్మిక రొటీన్ గా తనకిష్టమైన జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉన్న వీడియో ని షేర్ చేస్తూ Got in a lil workout on the birthday..   💃🏻అంటూ చెమటలు చిందిస్తూ బర్త్ డే ని ఇలా సెలెబ్రేట్ చేసుకున్నట్టుగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇక రష్మిక తనకి ఎప్ప్పుడు ఫ్రీ టైం ఉన్నా వర్కౌట్స్ చేస్తాను, షూటింగ్స్ తో అలిసిపోయినా జిమ్ వదలను అని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. 

Rashmika Latest Workout Video Goes Viral:

Rashmika Mandanna Workout Video Goes Viral

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ