కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్.. అధికార ఎన్డీయేకు అంతు చిక్కని రీతిలో వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే ఇండియా కూటమి కట్టి తమతో కలిసి నడిచే పార్టీలతో ముందుకెళ్తున్న కాంగ్రెస్.. తాజాగా మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే శుక్రవారం నాడు విడుదల
చేశారు. పాంచ్ న్యాయ్ సూత్రం ఆధారంగా ఒక్కో.. న్యాయ్ కింద ఐదు హామీలు చొప్పున మొత్తం కింద 25 హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. దేశంలోని అన్ని వర్గాలతో మాట్లాడిన మీదటే మేనిఫెస్టోను రూపొందించామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. 48 పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతులు, మహిళలు, కూలీలు, యూత్‌ను అట్రాక్ట్ చేసేలా రూపొందించింది.
మేనిఫెస్టోలోని అంశాలేంటో చూద్దాం రండి..!
ఎం.ఎస్ స్వామినాథన్ సిఫారసు మేరకు రైతులకు కనీస మద్దతు ధర
ఎంఎస్ పి డైరెక్ట్‌గా రైతులకు కేంద్రాలలో ఇస్తాము.
రైతు రుణాలకు ప్రత్యేక కమిషన్.
నూతన వ్యవసాయ చట్టాలను అధికారం రాగానే తీసేస్తాం
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దినసరి వేతనం నాలుగు వందలకు పెంపు
పట్టణాలలో అర్బన్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం
సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఖాళీల భర్తీ 3 ఏళ్లలో పూర్తి చేస్తాం
నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు
పేద మహిళలకు ఏడాదికి రూ. లక్ష ఆర్థిక సాయం
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన
కిసాన్ న్యాయ్ పేరుతో రైతులను ఆదుకుంటాం
వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు
పంటలకు కనీస మద్దతు ధర చట్టం తీసుకువస్తాం
రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ...
విద్యార్థులకు రూ.లక్ష ఆర్థికసాయం
ఆశ, అంగన్వాడీ మధ్యాహ్న భోజన వర్కర్లకు డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్
మహిళల హక్కుల రక్షణ కోసం అధికారి మైత్రి ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు
వర్కింగ్ విమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో రెట్టింపు హాస్టల్స్
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. రైల్వేల ప్రైవేటీకరణను నిలిపివేస్తాం
బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అగ్నివీర్‌ను రద్దు చేస్తాం అని కాంగ్రెస్ ప్రకటించినది. ఐతే ఈ పదేళ్ల కాలంలో మోడీ సర్కార్ చేసిన అచ్చు తప్పులను సరి చేస్తామని.. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని.. క్లియర్ కట్ గా కాంగ్రెస్ చెబుతోంది. ఈ మానిఫెస్టో కాంగ్రెస్ పార్టీని ఏ మాత్రం గట్టెక్కిస్తుంది అనేది చూడాలి మరి.