Advertisementt

ఇది శ్రీవల్లి జాతర లుక్.. తగ్గేదేలే

Tue 23rd Apr 2024 08:04 PM
rashmika mandanna srivalli  ఇది శ్రీవల్లి జాతర లుక్.. తగ్గేదేలే
Rashmika Mandanna Birthday Special Posters Creates Sensation ఇది శ్రీవల్లి జాతర లుక్.. తగ్గేదేలే
Advertisement
Ads by CJ

పుష్ప, యానిమ‌ల్ సినిమాలతో నేష‌న‌ల్ క్రష్‌గా మారిన క‌న్న‌డ క‌స్తూరి రష్మిక మందన్నా పుట్టినరోజు నేడు (ఏప్రిల్ 5). ఈ సందర్భంగా ఆమె నటిస్తోన్న సినిమాల నుండి మేకర్స్ న్యూ పోస్టర్స్‌ను విడుదల చేస్తున్నారు. ఈ పోస్టర్స్‌తో రష్మిక పేరుతో పాటు.. ఆయా పోస్టర్లకు సంబంధించిన సినిమాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో పుష్ప ద రూల్ సినిమాకు చెందిన పోస్టర్ అయితే.. ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. హ్యాపీ బర్త్‌డే శ్రీవల్లి అంటూ మేకర్స్ విడుదల చేసిన ఈ పోస్టర్‌తో మరోసారి పుష్పగాడి మాస్ జాతర ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. 

ఇంతకు అల్లు అర్జున్ పుట్టినరోజున టీజర్ అంటూ ప్రకటన నిమిత్తం వచ్చిన పోస్టర్ ఏ విధంగా ట్రెండ్ క్రియేట్ చేసిందో, పుష్ప గాడి రూల్ ఎలా ఉండబోతుందో.. ఫేస్ రివీల్ చేయకుండా వచ్చిన పోస్టరే సంచలనాన్ని క్రియేట్ చేయగా.. ఇప్పుడు రష్మిక మందన్నా శ్రీవల్లి లుక్ పోస్టర్ కేక అనేలా ఉంది. ఈ పోస్టర్‌లో రష్మిక లుక్ చూస్తుంటే.. ఇది కూడా జాతర సన్నివేశమే అని తెలుస్తోంది. ఇందులో రష్మిక సీరియస్‌గా చూస్తుండటం చూస్తుంటే.. ఈ సన్నివేశం ప్రేక్షకులకు కిక్ ఇవడం కాయం అనేలా క్లారిటీ వచ్చేస్తుంది.

పుష్ప ద రూల్ నుండే కాకుండా.. రష్మిక చేస్తున్న కుబేరా, ది గర్ల్‌ ఫ్రెండ్ చిత్రాల నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. మేకర్స్ పోస్టర్స్ విడుదల చేశారు. పుష్ప 2 పోస్టర్‌లో రష్మిక మాస్‌గా కనిపిస్తే.. ఈ రెండు సినిమాల పోస్టర్స్‌లో క్యూట్‌గా ఉంది. మరీ ముఖ్యంగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా పోస్టర్స్ చూస్తుంటే.. ఛలో సినిమాలో రష్మిక గుర్తొస్తుంది. మొత్తంగా అయితే రష్మిక బర్త్‌డే స్పెషల్‌గా వచ్చిన ఈ పోస్టర్స్.. ఆమెను టాప్‌లో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి. హ్యాపీ బర్త్‌డే రష్మిక మందన్నా.. #HappyBirthdayRashmikaMandanna

Rashmika Mandanna Birthday Special Posters Creates Sensation:

Rashmika Mandanna Srivalli Look From Pushpa The Rule Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ