Advertisementt

ఫ్యామిలీ స్టార్.. వార్తల్లో అనసూయ

Tue 23rd Apr 2024 06:36 PM
anasuya family star  ఫ్యామిలీ స్టార్.. వార్తల్లో అనసూయ
Again Anasuya Reacted on Netizen Aunty Comments ఫ్యామిలీ స్టార్.. వార్తల్లో అనసూయ
Advertisement
Ads by CJ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదల వేళ.. నటి అనసూయ వార్తలలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఇప్పుడనే కాదు.. విజయ్ దేవరకొండ విషయంలో ఎప్పుడూ అనసూయను ఆయన అభిమానులు ట్రోల్ చేస్తూనే ఉంటారు. అందుకు కారణం.. విజయ్ దేవరకొండ సినిమాల విషయంలో గతంలో అనసూయ రియాక్ట్ అవడమే. అయితే రీసెంట్‌గా విజయ్ దేవరకొండతో అసలు ఎటువంటి గొడవ లేదని, తన సినిమాలలో ఉన్న కంటెంట్‌ని మాత్రమే విమర్శించానని అనసూయ క్లారిటీ ఇస్తూ.. ఇకపై సోషల్ మీడియా వార్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. 

ఆ మాట చెప్పినప్పటి నుంచి అనసూయ ఎక్కడా ఎటువంటి కాంట్రవర్సీ పోస్ట్‌లు చేయలేదు. తన పని తను చేసుకుంటూ.. గ్లామర్ ఫొటోస్ పోస్ట్ చేసుకుంటూ కామ్‌గా ఉంటే.. ఫ్యామిలీ స్టార్ విడుదల వేళ కావాలని కొందరు నెటిజన్లు ఆమెను కెలికారు. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్‌లో పెళ్లి చూపులు సినిమా విడుదల తర్వాత తన బండికి ఫుల్ ట్యాంక్ చేయించాననేలా స్టేట్‌మెంట్స్‌కి ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ.. అతనిని విమర్శిస్తూ అనసూయ పేరును కూడా వాడేశాడు. ఆ నెటిజన్‌ ట్వీట్ చూసిన అనసూయ.. అసహనం వ్యక్తం చేస్తూ.. చాలా ఓపికగా రియాక్ట్ అయింది. 

ఎందుకండీ కార్తీక్‌గారూ.. అస్తమానం నన్ను లాగుతుంటారు. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో ఎప్పుడో చెప్పి నేనే వదిలేశాను. నేను హైప్ ఇస్తున్నానేమో అని పూర్తిగా వదిలేశాను. నేనూ తెలంగాణ బిడ్డనే. నాకు సింపథీ అవసరం లేదు. నా మీద నాకు నమ్మకం ఉంది. అలాగే దేవుడిపై కూడా నమ్మకం ఉంది. మా అమ్మానాన్నలు నేర్పిన విలువలు, పెంపకం.. నన్ను ఎప్పటికీ దిగజారనివ్వవు. ఇప్పుడీ ట్వీట్‌ని కూడా కొందరు తమ స్వార్థానికి వాడుకున్నా ఆశ్చర్యపోను. నాకు, వాళ్లకు ఎటువంటి సంబంధం లేదు.

అన్నట్లు మీ ఇంట్లో ఒకసారి అడిగి చూడండి. మనం ఏమైనా చుట్టాలమేమో. నాకు తెలిసి అయితే చుట్టాలం కానే కాదు. అలాంటప్పుడు నేను మీకు ఆంటీని కాను కదా. అయినా ఎందుకైనా మంచిది ఒకసారి ఇంట్లో అడిగి చూడండి. మీకు తెలియకుండా రిలేషన్స్ ఏమైనా ఉన్నాయేమో. ఎందుకంటే, చుట్టాలైతేనే ఆంటీ అనేలా పలకరింపులు ఉంటాయని మా పెద్దలు నాకు నేర్పారు. ఏదీఏమైనా మీకు మంచి జరగాలి.. అంటూ అనసూయ ఇచ్చిన సమాధానం టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారి వార్తలలో హైలెట్ అవుతోంది.

Again Anasuya Reacted on Netizen Aunty Comments:

Anasuya in News at Vijay Deverakonda Family Star Release time

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ