Advertisementt

అద్భుతం.. లవ్ యు గైస్: రష్మిక

Tue 23rd Apr 2024 05:47 PM
hbd rashmika mandanna  అద్భుతం.. లవ్ యు గైస్: రష్మిక
Rashmika Mandanna Birthday Special అద్భుతం.. లవ్ యు గైస్: రష్మిక
Advertisement
Ads by CJ

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా ఏ ఇండస్ట్రీ అయినా అడుగుపెట్టిన ప్రతి చోటా సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. కానీ అదే చేసి చూపిస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ కన్నడ బ్యూటీ కాలు పెట్టిన ప్రతిచోటా తన సత్తా చాటుతోంది. కన్నడ, తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్‌గా పేరొందిన ఈ శ్రీవల్లి.. ఇప్పుడు బాలీవుడ్‌లో తన సత్తా చాటుతోంది. రీసెంట్‌గా వచ్చిన యానిమల్‌తో అక్కడా తిరుగులేని విజయాన్ని అందుకుని, హిందీ బెల్ట్‌లోనూ బిజీ తారగా మారింది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో విక్కీ కౌశల్ సరసన ఛావా అనే సినిమా షూటింగ్‌ని పూర్తి చేసిన రష్మిక మందన్నా.. పాన్ ఇండియా మూవీ పుష్ప2 షూటింగ్‌లో బిజిబిజీగా ఉంది. ఈ సినిమాతో పాటు టాలీవుడ్‌లోనే మరో రెండు, మూడు సినిమాలతో గ్యాప్‌లేని షెడ్యూల్‌ని సెట్ చేసుకుంది. అందులో ధనుష్, నాగ్ నటిస్తున్న కుబేరా చిత్రం ఒకటి అయితే.. లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ది గర్ల్‌ఫ్రెండ్ మరొకటి. సినిమాలతోనే కాకుండా, సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ అభిమానులకు టచ్‌లో ఉండే ఈ నేషనల్ క్రష్ పుట్టినరోజు నేడు (ఏప్రిల్ 5). ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రష్మిక పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (#HappyBirthdayRashmikaMandanna)

అయితే తన పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు చేస్తున్న ప్రతి పనికి తను ఎంతో ఇంప్రెస్ అవుతున్నట్లుగా రష్మిక సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. మీ ట్వీట్స్ అన్నీ చూస్తున్నాను. అన్నింటికి సమాధానం ఇవ్వాలని ఉంది. నన్ను ట్రెండ్‌లో ఉంచినందుకు, సీడీపీ, విశెస్.. ఇలాంటి వాటిన్నింటికి లవ్ యు. అవన్నీ అద్భుతం.. లవ్ యు గైస్. యు ఆర్ ద బెస్టెస్ట్. బిగ్ హగ్స్.. అంటూ రష్మిక తన ఆనందాన్ని తెలియజేసింది.

ఇక తన సినీ ప్రయాణంపై ఇటీవల రష్మిక మాట్లాడుతూ.. అనేక భాషల్లో హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించగల అవకాశం దక్కుతుందని.. నా కెరీర్‌ ప్రారంభంలో అసలు అనుకోలేదు. దీనికి కారణం నా టాలెంట్‌ అని అస్సలు అనుకోను. ఎంతో మంది ప్రతిభ గల వారు ఉన్నప్పటికీ.. నాకు మాత్రమే ఇంత గొప్ప ఆదరణ దక్కడానికి కారణం నాకు వస్తున్న అవకాశాలే. నా కష్టంతో పాటు నా కోసం మంచి పాత్రలు సృష్టించిన రచయితలు, దర్శకులు.. అన్నింటికీ మించి ప్రేక్షకుల అభిమానం వల్లనే ఇది సాధ్యమైందని రష్మిక వెల్లడించింది.

Rashmika Mandanna Birthday Special:

Rashmika Mandanna Happy with Fans Edits