Advertisementt

పుష్ప 2 షూటింగ్‌పై గుడ్ న్యూస్

Fri 19th Apr 2024 10:31 AM
allu arjun pushpa 2  పుష్ప 2 షూటింగ్‌పై గుడ్ న్యూస్
Latest Update on Pushpa 2 Shooting పుష్ప 2 షూటింగ్‌పై గుడ్ న్యూస్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో క్రేజీ పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న పుష్ప ద రూల్ చిత్రానికి సంబందించిన ఏ అప్‌డేట్ అయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రాబోయే సోమవారం అల్లు అర్జున్ బర్త్‌డే. ఆ రోజున పుష్ప 2 నుంచి టీజర్ విడుదల చేస్తున్నట్టుగా పుష్ప మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దానికి కౌంట్‌డౌన్ పోస్టర్స్ వదులుతూ అల్లు ఫ్యాన్స్‌ని, పాన్ ఇండియా ప్రేక్షకులని అలెర్ట్ చేస్తున్నారు మేకర్స్. 

అయితే పుష్ప ద రూల్ షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుంది.. ఆగస్టు 15కి రిలీజ్ సాధ్యమేనా? అనే అనుమానంలో చాలామంది ఉన్నారు. ఆ తేదీకి ప్రభాస్ కల్కి వస్తే, పుష్ప వాయిదా పడుతుందనేలా ప్రచారం జరుగుతుంది. కానీ మేకర్స్ ఆగష్టు 15వ తేదీనే రిలీజ్.. ఈ విషయంలో తగ్గేదేలే అని మరోసారి అల్లు అర్జున్ బర్త్ డే అప్‌డేట్స్‌లో క్లారిటీ ఇస్తున్నారు. అయితే పుష్ప2 షూటింగ్ జూన్ నెలాఖరుకు మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. 

ప్రస్తుతం సుకుమార్-అల్లు అర్జున్-దేవీలు పుష్ప మ్యూజిక్ ఆల్బమ్ కసరత్తుల్లో ఉన్నారు. అయితే పుష్ప2 ఐటమ్ సాంగ్ ఇప్పటి వరకు చిత్రీకరించలేదట, చివరిలో చిత్రీకరిస్తారట, పుష్ప 2కి సీజీ వర్క్ ఎక్కువ వుండదు కనుక విడుదల సమయానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోస్ట్ ప్రొడక్షన్, అలాగే పబ్లిసిటీకి సుకుమార్ ఈసారి సరిపోయేంతగా టైం కేటాయిస్తారని తెలుస్తోంది. 

సో ఆగష్టు 15న ఖచ్చితంగా పుష్ప రాజ్ పాన్ ఇండియా మార్కెట్ రూల్ చేయడం పక్కా అనేలా క్లారిటీ అయితే వస్తోంది. మరి ఇది అల్లు అభిమానులని సంతోషపెట్టే వార్తే కదా.!

Latest Update on Pushpa 2 Shooting:

Good News to Allu Arjun Fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ