అసలు ఈపాటికి సోషల్ మీడియా మొత్తం ఎన్టీఆర్ ఫాన్స్ రచ్చ రచ్చ చేసేవారే. కారణం ఏప్రిల్ 5 న ఎన్టీఆర్ నటిస్తున్న దేవర విడుదల అని షూటింగ్ మొదలు కాకముందే మేకర్స్ ప్రకటించడంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న దేవర చిత్రం పై విపరీతమైన అంచనాలున్నాయి. అందుకే ఏప్రిల్ 5 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఏడాదిగా ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూశారు.
అదే జరిగి ఉంటే.. ఈపాటికి వారు సంబరాల్లో మునిగిపోయేవారు. దేవర బెనిఫిట్ షోస్, ప్రీమియర్స్ అంటూ రచ్చ చేసేవారు. కానీ ఇప్పుడు దేవర రావాల్సిన డేట్‌కి దేవరకొండ వస్తున్నాడు. అదే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌తో ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ విషయంలో అంటే దేవర పోస్ట్ పోన్ అయ్యి అక్టోబర్ కి వెళ్లిన విషయంలో ఎన్టీఆర్ ఫాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు.
అటు విజయ్ దేవరకొండ కూల్ గా ఫ్యామిలీ స్టార్ తో దిగుతున్నాడు. దేవర రావాల్సిన తేదీకి దేవరకొండ వస్తున్నాడనే చిన్న డిజప్పాయింట్ తప్ప.. దేవర లేట్ అయ్యింది అని వీరు బాధపడడం లేదు. బెస్ట్ అవుట్ ఫుట్ తో అక్టోబర్ కి వస్తుందిలే అని సరిపెట్టుకుంటున్నారు. మరి దేవర రాకపోయినా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరకొండని ఆదరిస్తారేమో చూద్దాం.