Advertisementt

శ్రీదేవి బయోపిక్: ఒప్పుకోనంటున్న బోని కపూర్

Thu 04th Apr 2024 05:45 PM
sridevi biopic  శ్రీదేవి బయోపిక్: ఒప్పుకోనంటున్న బోని కపూర్
Boney Kapoor On Sridevi Biopic శ్రీదేవి బయోపిక్: ఒప్పుకోనంటున్న బోని కపూర్
Advertisement
Ads by CJ

ఈమధ్య కాలంలో సినీ, రాజకీయ, సామజిక వేత్తల బయోపిక్స్ అనేవి పలు సినిమా ఇండస్ట్రీస్ లో తెరకెక్కడం కామన్ గా కనబడుతున్నాయి. ఆయా  వ్యక్తుల సక్సెస్ ఫుల్ స్టోరీని బయోపిక్ గా చిత్రీకరించేందుకు వాళ్ళ ఫ్యామిలిల అనుమతులు తీసుకుని మరీ వాటిని తెరకెక్కిస్తున్నారు. అందులో సావిత్రి బయోపిక్ ఎవ్వరు మరిచిపోలేనిది. అదే అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ తెరకెక్కించేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ ఉంది.  

కానీ శ్రీదేవి బయోపిక్ మాత్రం తెరకెక్కిస్తే తాను అనుమతిచ్చేదే లేదు అంటూ శ్రీదేవి భర్త బోనికపూర్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ఆయన నిర్మాతగా త్వరలోనే విడుదల కాబోతున్న మైదాన్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న బోనికపూర్ శ్రీదేవి బయోపిక్ పై చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్నాయి. బోనికపూర్ శ్రీదేవి బయోపిక్ విషయమై మట్లాడుతూ.. నా భార్య పర్సనల్ లైఫ్ కి చాలా ప్రాధాన్య‌త ఇచ్చేది. పర్సనల్ విషయాలు బ‌య‌టికి తెలియాల్సిన అవ‌స‌రం లేదని త‌న అభిప్రాయం. ఆమె ఆలోచ‌నల్లని, వ్య‌క్తిత్వాన్ని నేను ఎప్పుడూ గౌర‌విస్తాను. 

బ‌యోపిక్ లో అన్ని నిజాలే ఉండవు, కొన్నిసార్లు నిజాల‌ను వ‌క్రీక‌రించే అవ‌కాశం ఉంది. అందుకే నా భార్య ఆలోచ‌న‌ల ప్ర‌కారం త‌న బ‌యోపిక్ తీయ‌డానికి నేను ఒప్పుకొను. నేనున్నంత వరకు అంటే నేను బ‌తికి ఉన్నంత వ‌ర‌కు శ్రీదేవి బ‌యోపిక్ రాదు. ఎవ‌రూ దానిని తీయ‌లేరు అంటూ బోనీక‌పూర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

Boney Kapoor On Sridevi Biopic:

Won't Allow: Boney Kapoor On Sridevi Biopic

Tags:   SRIDEVI BIOPIC
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ