Advertisementt

NBK 109 కి టైటిల్ ఫిక్స్ అయ్యిందా ?

Thu 04th Apr 2024 03:24 PM
nbk109  NBK 109 కి టైటిల్ ఫిక్స్ అయ్యిందా ?
Is this NBK109 title NBK 109 కి టైటిల్ ఫిక్స్ అయ్యిందా ?
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఏపీ ఎన్నికల కోసం సమాయత్తమవ్వాల్సిన సమయం ఆన్నమైంది. ఏపీలో ఎన్నిక కోడ్ అమలులోకి వచ్చేసింది. హిందూపురం MLA గా బాలయ్య పోటీ చేయ్యబోతున్నారు. మరి బాలకృష్ణ ఇపుడు రాజకీయాలపై దృష్టి పెట్టాల్సిన సమయం. ఈలోపులో ఎంత వీలుంటే అంతగా NBK 109 షూటింగ్ ని ముగించే ఆలోచనలో ఆయన ఉన్నారు. 

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలయ్య పవర్ ఫుల్ కేరెక్టర్ లో కనిపించబోతున్న NBK 109 గ్లిమ్ప్స్ రీసెంట్ గా అంటే మహాశివరాత్రికి విడుదలై మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించింది. బాలయ్య మాస్ యాక్షన్ ఆ గ్లిమ్ప్స్ తో ఆకట్టుకున్నారు. అయితే బాలయ్య-బాబీ NBK 109 టైటిల్ అలాగే సినిమా విడుదల తేదీ ఇవ్వకుండా బాబీ నందమూరి అభిమానులని సస్పెన్స్ లో పెట్టాడు. అయితే ఇప్పుడు NBK 109 టైటిల్ పై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. 

ఉగాది రోజున రివీల్ చెయ్యబోయే NBK 109 కి వీర అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే బాలయ్య ఈ వీర టైటిల్ తో రెండు మూడు చిత్రాలు చేసారు. అది గోపీచంద్ మలినేని తో వీర సింహారెడ్డి, అంతకుముందు వీరభద్ర అనే భారీ డిసాస్టర్ లో నటించారు. ఇప్పుడు మరోసారి అదే వీర టైటిల్ అంటే అభిమానులు సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు. మరి మేకర్స్ వీర టైటిల్ నే NBK 109 కి పెడతారో.. లేదంటే అభిమానుల సెంటిమెంట్ ని ఫాలో అవుతారో చూడాలి. 

Is this NBK109 title:

Is this NBK109 title

Tags:   NBK109
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ