Advertisementt

వార్ కి సిద్ధమంటున్న యంగ్ టైగర్

Wed 03rd Apr 2024 09:59 PM
ntr  వార్ కి సిద్ధమంటున్న యంగ్ టైగర్
Jr NTR allocates dates for War 2? వార్ కి సిద్ధమంటున్న యంగ్ టైగర్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా వున్నారని అనుకుంటున్నారు. కానీ ఆయన యంగ్ హీరోలైన సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లతో కలిసి గత రాత్రి జాలీగా టిల్లు స్క్వేర్ మూవీని వీక్షించి ఆ యువ హీరోలతో టైం స్పెండ్ చేసారు. అయితే ఎన్టీఆర్ ముందుగా కొరటాల శివ దేవర కంప్లీట్ చేసేసి హిందీలో చెయ్యబోయే వార్ 2 సెట్స్ లో ఎంటర్ అవుతారని అనుకున్నారు. 

ఆర్.ఆర్.ఆర్ తర్వాత హిందీ నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఆచితూచి ఎన్టీఆర్ ఆయన్ ముఖర్జీ తో వార్ 2 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హృతిక్ రోషన్ హీరో, మరి ఎన్టీఆర్ ఎలా ఒప్పుకున్నాడనే మాటకి ఎన్టీఆర్ ఇందులో హృతిక్ తో సమానమైన పవర్ ఫుల్ కేరెక్టర్ లో కనిపిస్తాడనగానే ఎన్టీఆర్ ఫాన్స్ రిలాక్స్ అయ్యారు. హృతిక్-ఎన్టీఆర్ కలిసి చేసే యాక్షన్ సినిమాలో మెయిన్ హైలెట్ అని అంటున్నారు. 

అదలాఉంటే మార్చ్ లోనే హృతిక్ రోషన్ వార్2 సెట్స్ లోకి వెళ్ళిపోయాడు. ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు వెళ్తాడా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ క్షణం వచ్చేసింది. ఎన్టీఆర్ హైదరాబాద్ టు ముంబై ట్రావెలింగ్ కి ముహుర్తం ఖరారైంది అంటున్నారు. 

ఎన్టీఆర్ వార్ 2 కోసం డేట్లు కేటాయించిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ నెల అంటే ఏప్రిల్ మూడో వారం నుంచి ఎన్టీఆర్ వార్ 2 సెట్లో అడుగు పెట్ట‌బోతున్నాడ‌ట‌. ముంబై లోని స్పెషల్ సెట్ లో ప‌ది రోజుల పాటు జ‌రిగే ఈ షెడ్యూల్ లో దర్శకుడు ఆయన్ ఎన్టీఆర్ పై కీల‌క స‌న్నివేశాల్ని తెరకెక్కిస్తార‌ని తెలుస్తోంది. ఈచిత్రంలో ఎన్టీఆర్ ఇండియన్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారనే టాక్ బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో నడుస్తుంది. 

Jr NTR allocates dates for War 2?:

NTR to enter War 2 sets in April 3rd week?

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ